చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొనడం కలకలం రేపుతోంది. భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం నిలిపివేసి ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించింది.
ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ దిగుమతులను అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక ప్రైవేట్ సంస్థ రవాణా చేసిన ఐదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేశామని కరోనా వైరస్ మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఒక ప్రైవేట్ సంస్థ రవానా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులోని మాంస పదార్థాలను వారం తరువాత నాశనం చేస్తామని పేర్కొన్నారు. కాంబోడియాలోని కెంపాంగ్ స్పే రాష్ట్రం ఒరాల్ జిల్లాలో వచ్చే రెండు మూడు రోజుల్లో మాంసాన్ని దగ్దం చేస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ వై సామ్నాంగ్ తెలిపారు. ఒరాల్ జిల్లా అధికారులకు ఈ మేరకు జులై 26న మార్గదర్శకాలను జారీచేసిన గవర్నర్ ఈ విషయంలో సహకరించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాంసాన్ని తప్పనిసరిగా కాల్చాలని సామ్నాంగ్ నొక్కి చెప్పారు. అంతేకాదు, మాంసం కొనుగోలు చేయడానికి ముందు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకున్నారనే వివరాలను ప్రజలు అడగాలని సూచించారు. కంబోడియాలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి.