అక్షయ తృతీయ నాడు బంగారం కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ ఒక్క వస్తువు కొంటే కనుక మీకు తిరుగుండదు. ఎందుకో మీరే చదవండి.
అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిదని చెప్పి అందరూ కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఆరోజున బంగారం కొంటే ఐశ్వర్యం పెరుగుతుందని, సంపద రెట్టింపు అవుతుందని, శ్రేయస్సు ఉంటుందని చెబుతుంటారు. అయితే బంగారం కంటే కూడా ఈ అక్షయ తృతీయ నాడు ఒక వస్తువు కొంటే చాలు. మీ జీవితం దశ తిరిగిపోతుంది. బంగారం కొంటే దశ తిరుగుతుందని మీరు నమ్మితే గనుక ఖచ్చితంగా మీరు బంగారం కొన్నా కొనకపోయినా ఒక వస్తువు మాత్రం కొంటే మీరు అతి తక్కువ కాలంలోనే ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. బంగారాన్ని మించిన విలువైన వస్తువు ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయాల్సిందే.
బంగారం కంటే విలువైనది వజ్రం. వజ్రాన్ని అందరూ కొనలేరు కానీ వజ్రం లాంటి భూమిని కొనగలరు కదా. అవును భూమి బంగారం కాదు, వజ్రం. మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు భూమి, బంగారం రేటు పలుకుతుందని అనేవారు. మరి ఇప్పుడో బంగారాన్ని మించిన ధర పలుకుతోంది. ఎందుకంటే బంగారం కంటే భూమి రేటు ఎన్నో రెట్లు పెరిగిపోతోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది. పట్టణాలు నగరాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. పొలాలు కూడా ఇండ్ల స్థలాలు అయిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకి భూమి సరిపోవడం లేదు. అందుకే భూమికి విలువ పెరిగిపోయింది. పల్లెటూర్లలో కూడా ఇండ్ల స్థలాలు భారీగా పెరిగిపోయాయి. సెంటు లక్ష, 2 లక్షలు, 5 లక్షలకు అమ్ముతున్నారు. ఇక సిటీల్లో ఏ రేటు ఉంటుందో చూసుకోండి.
స్థలం కొని ఏడాది ఆగితే దాని రేటు పెరిగిపోతుంది. అందుకే కొంతమంది బంగారం మీద కన్నా భూమి మీద పెట్టుబడి పెడతారు. భూమిని నమ్ముకున్నవారికి భూదేవి తల్లి అపాయం చేయదని నమ్మకం. మీరు అభివృద్ధి చెందే ప్రాంతంలో స్థలం కొన్నా, అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతంలో స్థలం కొన్నా దాని విలువ అనేది ఎప్పటికీ పెరుగుతుంది. 2019 లో వచ్చిన నివేదిక ప్రకారం 2017, 2018 సమయంలో హైదరాబాద్ కూకట్ పల్లిలో ఎకరం రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్లు ఉండేది. కానీ ఆ తర్వాత అది రూ. 48 కోట్ల నుంచి రూ. 58 కోట్లకు పెరిగిపోయింది. అంటే రెండేళ్లలో రెట్టింపు అయ్యింది. భూముల ధరలు వంద శాతం పెరిగాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, భూమి ఎంత విలువైనదో అని. రెండేళ్లలోనే అంతలా పెరిగిందంటే పదేళ్లలో, పాతికేళ్లలో ఎంత పెరుగుతుందో అర్థం చేసుకోండి.
అదే ఇవాళ ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం రూ. 61 వేలు పెట్టి బంగారం కొంటే ఏడాది తర్వాత గట్టిగా 5 వేలు కంటే ఎక్కువ పెరగదు. ఏడేళ్ల క్రితం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 41,707 ఉంటే ఇవాళ ప్రస్తుతం రూ. 61,150 ఉంది. ఈ ఏడేళ్లలో ఎంత పెరిగినట్టు? అందుకే బంగారం కంటే భూమి కొనడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతారు. నగరం శివారున ఒక ఖాళీ స్థలం కొన్నా.. అది ఏడాది తర్వాత పెరిగిపోతుంది. ఇక అక్షయ తృతీయ నాడే ఎందుకు కొనాలి అంటే.. ఈరోజున విలువైనది ఏది కొన్నా అది రెట్టింపు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి భూమి కొంటే ఎన్ని రెట్లు పెరుగుతుందో ఆలోచించుకోండి. డెవలపర్లు కూడా అక్షయ తృతీయ సందర్భంగా భూమి కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకి గృహ రుణాలు ఇస్తున్నాయి.
బంగారం, స్టాక్స్, ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టడం వంటి వాటి కంటే రియల్ ఎస్టేట్ లో పెడితే దాని ఫలితం జెట్ స్పీడ్ లో వస్తుంది. ఈ 40 సంవత్సరాలలో బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటి మీద పెట్టుబడి పెట్టగా సంపద పెరిగిన తీరు గమనిస్తే.. ఫిక్స్డ్ డిపాజిట్ విలువ 20 రెట్లు పెరిగింది. వెండి విలువ 24 రెట్లు పెరగగా, బంగారం విలువ 47 రెట్లు పెరిగింది. వీటన్నిటికంటే ఎక్కువగా భూమి విలువ అనేది ఏకంగా 500 రెట్లు పెరిగింది. అక్షయ తృతీయ నాడు భూమి మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తు తరాలకు బాట వేస్తోంది. ఈరోజున చాలా మంది కొత్త వ్యాపారాలు మొదలుపెడతారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అంతా శుభమే జరుగుతుందని నమ్మకం. అక్షయ అంటే క్షయం లేనిది, తరగనిది, చిరకాలం ఉండేది. అందుకే ఈరోజు బంగారం బదులు ఒక చిన్న ఖాళీ స్థలం కొన్నా మీరు కొన్నేళ్లలో కోటీశ్వరులు అవుతారు. అలా అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ చుట్టూ మీ ఊర్లోనే ఉంటారు. ఒకప్పుడు 2 వేలకు, 3 వేలకు భూమి కొన్నవాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ భూమి కొనేవాళ్ళకే ఒక రేంజ్ ఉంటుంది.