రీల్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి కావాల్సిన మొదటి ప్రామాణిక అంశం.. అత్యధిక ఫాలోవర్స్. సెలబ్రిటీలకంటే వాళ్లకి ఉన్న ఇమేజ్ కారణంగా వెంటనే ఫాలోవర్స్ వస్తారు. కానీ అప్పుడే స్టార్ట్ చేసిన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకి అధిక సంఖ్యలో ఫాలోవర్స్ రావడం అంటే కష్టమే. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే సత్తా కంటెంట్ కి ఉంటుంది. మంచి కంటెంట్ తో వ్యూవర్స్ ని అలరిస్తే కనుక ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఒకప్పటితో పోల్చుకుంటే ఫాలోవర్స్ ని పెంచుకోవడం ఇప్పుడే ఈజీ. ఎందుకంటే మీ వీడియో చూడడం కోసం 60 సెకండ్ల సమయం కేటాయించడం అంటే యూజర్ కి పెద్ద సమస్య ఏమీ కాదు. అదే ఏ షార్ట్ ఫిల్మో చూడాలంటే ఆలోచిస్తాడు. అదే రీల్ అనుకోండి.. చూద్దాం పోయేదేముంది అని అనుకుంటారు. నచ్చితే మీ వీడియోలే చూస్తూ ఉంటారు.
ఇలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని పెంచుకున్నాక మీకు డబ్బు సంపాదించుకునే మార్గం వస్తుంది. కొన్ని కంపెనీలు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళతో తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయించుకుంటాయి. కొన్ని కంపెనీలు వెయ్యి మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి 10 డాలర్లు చెల్లిస్తే.. కొన్ని కంపెనీలు 80 డాలర్ల కంటే ఎక్కువ చెల్లిస్తాయి. 5 వేల నుంచి 10 వేల మంది ఫాలోవర్స్ ఉంటే గనుక.. ఒక్కో రీల్ కి రూ. 6 వేల పైనే సంపాదించుకోవచ్చు. 50 వేల నుంచి లక్ష మంది ఫాలోవర్స్ ఉంటే ఒక్కో రీల్ లేదా పోస్ట్ కి రూ. 14 వేల కంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఇలా నెలకి ఒక పది కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా కనీసం 60 వేల నుంచి లక్షా యాభై వేలు, ఆపై సంపాదించుకోవచ్చు.
ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అయితే రీల్ చేసే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు పెట్టే హ్యాష్ ట్యాగ్ చాలా ముఖ్యం. ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ ని మీ వీడియోస్ లో పెడితే మీ వీడియో లేదా పోస్టుకి రీచ్ ఉంటుంది. అలానే మీరు చేసే వీడియో క్లారిటీగా ఉండాలి. రీల్స్ చేసే ముందు ఎక్కువగా జనాలు ఎలాంటివి చూస్తున్నారో దాని బట్టి అవగాహనకు రండి. ఎక్కువగా జనాన్ని ఆకర్షించే కంటెంట్ ని, కొంచెం డిఫరెంట్ గా ఉన్న కంటెంట్ ని, లేదా ఎడ్యుకేట్ చేసే కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్, కామెడీ ఇలా ఎలాంటి కంటెంట్ అయినా మీ మాటలతో ఆకట్టుకునేలా ఉంటే జనం ఖచ్చితంగా చూస్తారు. అయితే రెగ్యులర్ గా చేసేలా ఉంటేనే రీల్స్ చేయండి. అప్పుడప్పుడూ చేసేలా ఉంటే ఫాలోవర్స్ కి ఆసక్తి ఉండదు.
ఇదొక పధ్ధతి అయితే.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వెబ్ సైట్స్ లలో ఉన్న వస్తువులను అమ్మడం ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఆయా కంపెనీలను సంప్రదించి.. మీ వివరాలు ఇస్తే.. వారు ఇచ్చే లింక్ ని మీ వీడియోల డిస్క్రిప్షన్ లో పెడితే.. వాటిని చూసి ఎవరైనా క్లిక్ చేసి కొంటే మీకు కమిషన్ వస్తుంది. ఇలా ఇన్స్టా రీల్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా అని దీని కోసం ఉద్యోగం మానేయాల్సిన పని కూడా లేదు. ఉద్యోగం చేస్తూ కూడా సమయం కుదిరినప్పుడల్లా చేసుకోవచ్చు. బాగా ప్రజాదరణ పొందిన తర్వాత దీన్నే ఉద్యోగంలా కూడా మార్చుకోవచ్చు. అప్పుడు పాత ఉద్యోగంలో వచ్చిన జీతం కంటే.. ఈ ఇన్స్టా ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ ఉంటుంది.
ఇన్స్టా రీల్స్ తోనే కాదు.. యూట్యూబ్ షార్ట్స్ తోనూ డబ్బులు సంపాదించుకోవచ్చు. షార్ట్ వీడియోలకు కూడా యూట్యూబ్ మానిటైజేషన్ సదుపాయం కల్పిస్తుంది. మీ యూట్యూబ్ ఛానల్ కి మానిటైజేషన్ వస్తే.. మీ ఛానల్ లో ప్రకటనలు వస్తాయి. ప్రకటనల ద్వారా యూట్యూబ్ మీకు 45 శాతం ఆదాయం ఇస్తుంది. మానిటైజేషన్ కి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరింకెందుకు ఆలస్యం.. రీల్స్, షార్ట్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకోండి. మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించి.. లైకులు, కామెంట్లు, సబ్ స్క్రైబర్లను పెంచుకోండి. పార్ట్ టైమ్ వీడియోలు చేస్తూ మంచి ఆదాయం పొందండి. ఆల్ ది బెస్ట్..