ప్రస్తుతం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇండియాలో బాయ్ కాట్ హ్యూండాయ్ అంటూ పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్లో హ్యూండాయ్ కంపెనీ షేర్లు కూడా ఊహించని రేంజ్ లో కుప్పకూలాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఇంత రచ్చ జరగడానికి స్వయంకృపరాధమే కారణం.
Hyundai in Pakistan is asking for freedom of Kashmir.
Hyundai Pakistan also posted them same on its Facebook page. Link: https://t.co/ZOBDggsdW0 pic.twitter.com/Kmmk2Rc1wu
— Anshul Saxena (@AskAnshul) February 6, 2022
అసలు విషయం ఏంటంటే.. రెండ్రోజుల క్రితం హ్యూండాయ్ ఆ సంస్థ అధికారిక సోషల్ మీడియా పేజీలో పెట్టిన పోస్టు.. పాకిస్తాన్ కు అనుకూల, భారత సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉందంటూ దుమారం లేచింది. పాకిస్తాన్ లో, కశ్మీర్ లో వేర్పాటువాద ఉద్యామానికి మద్దతుగా ఏటా ఫిబ్రవరి 5ను ‘కశ్మీర్ ఐక్యతా దినోత్సవం’గా జరుపుతారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా కశ్మీర్ ఐక్యతా దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా హ్యూండాయ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో ‘కశ్మీరీ సోదరుల త్యాగాన్ని స్మరించుకుందాం. స్వేచ్ఛ కోసం కొనసాగుతున్న వారి పోరాటంలో వారికి మద్దతు ఇస్తాం’ అంటూ పోస్టు చేసింది.
పోస్టు చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో కార్చిచ్చులా వైరల్ అయ్యింది. భారతీయులు అందరూ #boycotthyundai హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. అది జాతీయస్థాయిలో పెద్ద చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ అనుకూల హ్యూండాయ్ కంపెనీ కార్లను భారతీయులు కొనుగోలు చేయద్దంటూ ఉద్యమాలు మొదలయ్యాయి. దేశభక్తి ఉన్న టాటా, మహీంద్రా కార్లనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం వల్ల హ్యూండాయ్ కంపెనీ భారీ నష్టాలే చవిచూసింది. స్టాక్ మార్కెట్ లో సోమవారం తమ షేర్ విలువ 1.84 శాతం(3500) పతమైంది.
Official Statement from Hyundai Motor India Ltd.#Hyundai #HyundaiIndia pic.twitter.com/dDsdFXbaOd
— Hyundai India (@HyundaiIndia) February 6, 2022
ఆందోళన తీవ్రస్థాయికి చేరుకోగానే హ్యూండాయ్ కంపెనీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఆ పోస్టుపై కంపెనీ వెనక్కి తగ్గింది. వెంటనే వివాదాస్పద పోస్ట్‌ను డెలిట్ చేసింది. పోస్ట్ డెలిట్ చేశాక.. ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హ్యుండాయ్ భారత్ లో పాతికేళ్లుగా పనిచేస్తోంది. మేము భారతదేశ జాతీయతను గౌరవిస్తాం. భారతదేశం హ్యుండాయ్ బ్రాండ్ కి రెండో ఇల్లు లాంటిది. భారతదేశ జాతీయవాద పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. ఆ విధానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఆ వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశం, భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం మేము పని చేస్తూనే ఉంటాం.’ అంటూ ప్రకటించింది. ఈ వివాదంపై హ్యూండాయ్ ప్రకటన మరి ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. హ్యూండాయ్ కంపెనీ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.