బైక్ అనేది యువకులకు ఒక ఎమోషన్. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్స్ అంటే యువత పిచ్చెక్కిపోతారు. రోడ్ల మీద రాకెట్ లా దూసుకుపోవాలని ప్రతీ బైకు ప్రియుడూ కోరుకుంటాడు. అందుకే మార్కెట్ లో ఏ కొత్త మోడల్ వచ్చినా కొనేస్తారు. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ని మార్కెట్ లో దింపుతుంటాయి. తాజాగా బీఎండబ్ల్యూ కంపెనీ కూడా ఒక సూపర్ బైక్ ని పరిచయం చేస్తోంది. బీఎండబ్ల్యూ కంపెనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ కంపెనీ కార్లన్నా, బైకులన్నా జనం పిచ్చెక్కిపోతారు. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ కంపెనీ ‘2023 ఎస్ 1000 ఆర్ఆర్’ అనే మోడల్ బైకుని డిసెంబర్ 10న భారతమార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ మోడల్ ఈ ఏడాది సెప్టెంబర్ లోనే భారత్ మినహా ప్రపంచ మార్కెట్లలో రిలీజ్ అయ్యింది.
అయితే భారత్ మార్కెట్ లోకి రాబోయే ఈ మోడల్ ను.. ఇంజన్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో అప్ డేట్ చేశారు. బీఎండబ్ల్యూ ఫ్లాగ్ షిప్ బైకులతో పోలిస్తే.. ఈ బైకులో కొన్ని కీలక మార్పులు జరిగాయి. లేటెస్ట్ ఇంజన్, సస్పెన్షన్ కంట్రోల్, ఛాసిస్, ఏరోడైనమిక్స్, డిజైన్ వంటి కీలక అప్ డేట్స్ తో ఈ సూపర్ బైక్ లాంచ్ కాబోతుంది. 999 సీసీ ఇన్లైన్ ఫోర్ మోటార్ శక్తితో నడిచే ఈ సూపర్ బైక్ 6 గేర్లు కలిగి ఉంటుంది. 13,500 ఆర్పీఎం, 205 హార్స్ పవర్ తో గుర్రంలా పరిగెడుతుంది. ఇంజన్ స్పీడ్ మునుపటి మోడల్ తో పోలిస్తే ఇప్పుడు మరింత మెరుగ్గా ఉంది. 14,600 ఆర్పీఎం వరకూ మోటార్ ను పుష్ చేస్తుంది. ఇక బైక్ వీల్ బేస్ 1441 ఎంఎం నుంచి 1457 ఎంఎం వరకూ పెరిగింది. ఈ బైక్ డైనమిక్ బ్రేక్ కంట్రోల్, స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్స్ తో వస్తుంది. ఈ మోడల్ బైక్ మూడు రంగుల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ బైకులను డీలర్ల ద్వారా విక్రయించనుంది కంపెనీ. దీని ధర విషయానికొస్తే.. ఎక్స్ షోరూమ్ ధర రూ. 20 నుంచి 25 లక్షలు ఉంటుందని అంచనా.
2023 BMW S 1000 RR launching in India on Dec 10.
The 2023 S 1000 RR gets some significant changes over its predecessor. Producing a total of 210hp, 3hp more than the previous model. Torque remains the same at 113Nm. pic.twitter.com/zTsTFujNZu
— PowerDrift (@PowerDrift) November 23, 2022