కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అని ఓ కవి చెప్పినట్లు.. నిరంతర కృషి, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ ఉంటే అనుకున్న ఏ పనైనా సాధించగలం అని ఎంతో మంది నిరూపించారు.
జీవితంలో ఏదైనా సాధించాలన్న కోరిక, పట్టుదలకు తోడు లాలెంట్ ఉన్నవారు ఎందులో అయినా సక్సెస్ అవుతారు. దేశంలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సక్సెస్ సాధించడం అంటే మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు.. దానికి ఎంతో శ్రమ, పట్టుదల, నిరంతర కృషి కావాలి. ఇవన్నీ పాటించినా కూడా సక్సెస్ అంత త్వరగా సాధిస్తారని నమ్మకం ఉండదు.. కానీ ఎంతో ఓర్పుతో ఎంతో మంది మహిళలు తమ సొంత వ్యాపారాలు చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. అలా కష్టపడి సక్సెస్ సాధించిన వారిలో ఒకరు మిను మార్గరెట్. ఆమె సాధించిన సక్సెస్ ఏంటీ.. ఆమె స్థాపించిన కంపెనీ ద్వారా ఎంత టర్నోవర్ వస్తుందన్న విషయాల గురించి తెలుసుకుందాం.
బెంగుళూరు కి చెందిన మిను మార్గరెట్ వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా పలు కంపెనీల్లో జాబ్ చేసింది. విప్రో, గోల్డ్ మెన్ శాక్స్ వంటి పెద్ద కంపెనీల్లో వర్క్ చేస్తున్న సమయంలో తనకు ఓ ఆలోచన వచ్చింది. తన సొంతంగా వ్యాపారం చేస్తే ఎలాం ఉంటుందని.. కానీ అందుకు చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందని గ్రహించింది. ఈ క్రమంలో ఉద్యోగం మానివేసింది. తన సొంత కంపెనీ కోసం ఏర్పాట్లు చేసుకుంది. 2020 లో బ్లిస్ క్లబ్ అనే కంపెనీ ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రారంభించడానికి ముందు మిను మార్గరెట్ ‘రెంట్ యువర్ వార్డ్ రోబ్’ పేరుతో అమెరికాకు చెందిన రెంట్ ది రన్ వే సంస్థ స్ఫూర్తితో బట్టలు అద్దెకు ఇచ్చే వ్యాపారం మొదలు పెట్టింది.
ఈ వ్యాపారం మిను మార్గరెట్ కి ఆశించినంతగా సక్సెస్ తీసుకు రాలేదు. ఆ తర్వాత ఆటో మేటెడ్ లాండ్రో మేట్ అనే వ్యాపారం మొదలు పెట్టింది.. అది కూడా సక్సెస్ కాలేదు.. తక్కువ సమయంలోనే నిలిపివేయాల్సి వచ్చింది. రెండు సార్లు అనుకున్నది సాధించలేదు.. ఫెయిల్ అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. అదే సమయంలో 2020 లో బ్లిస్ క్లబ్ ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన సంవత్సరంలోనే రూ.18 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సాధించగలిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ.36 లక్షల నుంచి రూ.15 కోట్లకు పెరిగింది. కంపెనీ మొదలు పెట్టినప్పటి నుంచి 18 నెలలో రూ.100 కోట్ల వార్షిక ఆదాయం గడించినట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన రెండు ఆన్ లైన్ స్టోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక మిను మార్గరెట్ విషయానికి వస్తే.. బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్సిటలో బీకాం పూర్తి చేసి.. యూకేలో సీఏగా చేసింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మార్కెటింగ్ ఆండ్ ఫైనాన్స్ లో మేజర్స్ కంప్లీట్ చేసింది. ఇక ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత మహిళల కోసం యాక్టీవ్ వేర్ బ్రాండ్ ఆరంభించాలనే ఆలోచనలో ఉండేది. మహిళలు వస్త్రాల విషయంలో ఏమి కోరుకుంటారో ఆమె బాగా స్టడీ చేసింది. అలా మహిళలకు అవసరమైన దుస్తులను అందించడానికే తన కంపెనీ ప్రారంభించినట్లు మిను మార్గరెట్ తెలిపింది. ప్రస్తుతం తన వ్యాపారం చాలా బాగా సాగుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.