ప్రతి ఒక్కరు ప్రయాణ సమయంలో వాటర్ బాటిల్స్ ను కొనుగోలు చేస్తుంటారు. అలానే ఇతర కార్యక్రమాలకు వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తుంటారు. అయితే డ్రింకింగ్ వాటర్ బాటిల్ బ్రాండ్స్ లో ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్స్ లో బిస్లరీ ఒకటి. ప్రయాణ సమయాల్లో బిస్లరీ బ్రాండ్ ను ఉపయోగించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు స్టేటస్ కి సింబల్ గా ఈ వాటర్ బాటిల్ ను భావిస్తుంటారు. అయితే ఈ వాటర్ బాటిల్ నీళ్లు తాగే వారికి ఓ బ్యాడ్ న్యూస్. భవిష్యత్ లో ఈ బ్రాండ్ కనుమరుగు కానుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రైలు, బస్సు వంటి జర్నీ సమయంలో ప్రతి ఒక్కరు బిస్లరీ వాటర్ బాటిల్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇతర కంపెనీల వాటర్ బాటిల్ ఎన్ని ఉన్నా.. ఎక్కువ మంది చూపు బిస్లరీపైనే ఉంటుంది. ఇంకా దారుణం ఏమింటంటే..దానికి ఉన్న బ్రాండ్ ను ఉపయోగించుకుని కొందరు నకిలీ బాటీలు తయారు చేసి.. డబ్బులు దండుకుంటున్నారు. ప్రజల మనస్సులో అంతలా బిస్లరీ నిలిచిపోయింది. అయితే అలాంటి ప్రాముఖ్యత కలిగిన బిస్లరీ త్వరలో కనుమరుగై పోనున్నాయి. ఈ సంస్థను టాటాకు విక్రయించాలని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ రమేష్ చౌహాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ ఒప్పదం విలువ దాదాపు రూ.6,000 కోట్ల నుంచి రూ.7000 కోట్ల మధ్య ఉందని ఎకనామిక్స్ టైమ్ పేర్కొంది. రమేష్ చౌహాన్ ఆరోగ్యం సరిలేకపోవడం, ఆయన కుమార్తెకు వ్యాపారంపై ఆసక్తి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టాటా ఇప్పటికిప్పుడు టేకోవర్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న మేనేజ్‌మెంట్ రెండేళ్ల పాటు కొనసాగాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
బిస్లరీని అమ్మేయాలనే నిర్ణయానికి రావడం చాలా బాధ కలిగించిందని, టాటా గ్రూప్ మరింత మెరుగ్గా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతుందని రమేష్ చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర బయ్యర్ల కంటే టాటా సంస్థ వైపే తాను మొగ్గుచూపడానికి కారణం టాటా గ్రూప్ పాటించే విలువలేనని ఆయన తెలిపారు. రూ.220 కోట్ల లాభంతో అతి పెద్ద డ్రింకింగ్ వాటర్ కంపెనీగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్‌తో కొనసాగుతున్న సంస్థ బిస్లరీ కావడం గమనార్హం. ఇలాంటి సంస్థ త్వరలో కనుమరుగై కానుంది. ఇక టాటా విషయానికి వస్తే.. భారత్ లో ఉన్న అతి పెద్ద సంస్థలో టాటా గ్రూప్ ఒకటి. ఈ సంస్థ అనేక రంగాల్లో అడుగు పెట్టి..తనదైన ముద్ర వేసింది. టాటా గ్రూప్ సంస్థ కూడా ఇప్పటికే డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలో కొనసాగుతోంది. హిమాలయన్ బ్రాండ్ పేరుతో, టాటా కాపర్ ప్లస్ వాటర్ బ్రాండ్ పేరుతో మినరల్ వాటర్ ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రేషన్ లో కూడా టాటా గ్లూకో ప్లస్ కూ మంచి మార్కెట్ ఉంది.