ప్రైమ్ వినియోగదారులకు పెద్ద షాకింగ్ వార్తే చెప్పింది. తొందర్లోనే తమ ప్రైమ్ మెంబర్ షిప్ సబ్‌స్క్రిప్షన్ ధర పెంచనున్నట్లు ప్రకటించింది. ఎప్పటి నుంచి అన్న దానిపై క్లారిటీ ఇవ్వకపోయినా.. పెంచడం మాత్రం పక్కా అని చెప్తోంది. వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఒక్కటే కాదు.. మంత్లీ, క్వాటర్లీ ప్లాన్‌ని కూడా పెంచనున్నట్లు చెప్తోంది. ధరల పెంపుపై తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ప్రైమ్ ప్లాన్ ఎంత ఉంది? అసలు ప్రైమ్ ప్లాన్ లాభాలు? కొత్త ధరలు ఎంత ఉండబోతున్నాయి? చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వల్ల చాలా లాభాలే ఉన్నాయి. వినియోగదారుడిని ప్రైమ్ మెంబర్‌షిప్‌తో ప్రైమ్ వీడియోలు, ప్రైమ్ మ్యూజిక్ మాత్రమే కాకుండా అమెజాన్‌లో మీరు కొనుగోలు చేసే ఉత్పత్తులను ఉచితంగా హోమ్ డెలివరీ కూడా చేస్తుంది. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు మిగతా వినియోగాదారుల కంటే ప్రైమ్ వినియోగదారులకు త్వరగా డెలివరీ కూడా చేస్తుంది.
ఇదీ చదవండి: ఫ్లాపైన జెస్సీ- సిరి గేమ్ ప్లాన్.. కన్నీరు పెట్టుకుంటూ షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్
ఈ ప్రయోజనాలు పొందేందుకు అమెజాన్ మూడు రకాల ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఏడాదికి రూ.999 వసూలు చేస్తోంది. మూడు నెలలకు 329 రూపాయలు తీసుకోగా.. నెలకు 129 రూపాయలు ఛార్జ్ చేసేది. ఇప్పుడు తాజాగా ఇయర్లీ ప్లాన్‌ను 1499 రూపాయలుగా.. మూడు నెలలకు రూ.459, నెలకు చందా రూ.179గా నిర్ణయించింది. పెరిగిన ధరలు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కొత్తగా వచ్చే వారికి ప్రస్తుత ధరలే తీసుకంటామన్న అమెజాన్.. అందరికీ ఒకేసారి ధరలు పెంచుతామని ప్రకటించింది. ధరల పెంపునకు కారణాలు చెప్పలేదు. కరోనా దృష్ట్యా ఓటీటీకి ఎక్కువ యూజర్లు పెరగడటం.. ఈ- కామర్స్ వెబ్‌సైట్లపై ఆధారపడి ఎక్కువ కొనుగోళ్లు జరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని వినియోగదారులు భావిస్తున్నారు. మరి సబ్‌స్క్రిప్షన్ పెంచితే వినియోగదారులు కొనసాగుతారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. అమెజాన్ ఇలా ధరలు పెంచడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.