సన్‌రూఫ్ కార్లు కొనాలనుకునే వారికి ఇండియాలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు అందిస్తున్న ఈ కార్లు బెస్ట్ అని చెప్పొచ్చు. అందుబాటు బడ్జెట్ లో నూతన టెక్నాలజీ, ఫీచర్లతో మార్కెట్ లో ఉన్నాయి.
ఆటోమొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్ తో వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా పలు రకాల ఫీచర్లతో కార్లను రూపొందిస్తుంటాయి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు. నేడు ప్రజల ఆదాయ మార్గాలు పెరిగి కార్లు వినియోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ మధ్య ప్రతి ఆటో మొబైల్ కంపెనీ ఆధునిక టెక్నాలజీ, అద్భుతమైన ఫీచర్లతో కార్లను రూపొందించి అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే కారులో సన్‌రూఫ్ ఆప్షన్ ఉండి తక్కువ ధరలో లభించే వాహనాల కోసం వాహనదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు ఆటోమొబైల్ సంస్థలు పది లక్షల లోపు సన్‌రూఫ్ ఆప్షన్ ఉండే విధంగా కార్లను తయారు చేస్తున్నాయి. ఆ కార్ల వివరాలు మీకోసం..
హ్యుందాయ్ ఐ20
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ కు చెందిన i20 కారులో సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. పది లక్షలలోపు హ్యుందాయ్ నుండి వచ్చిన రెండవ కారు. ఇది ఆస్టా వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.9.01 లక్షలు (ఎక్స్ షోరూమ్.).దీని ఫీచర్లలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి.
టాటా నెక్సన్ XM (S)
టాటా నెక్సాన్ ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. Nexon XM (S) వేరియంట్‌ను రూ. 9.4 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
మహీంద్రా XUV300 – W6
మరో అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV300. కంపెనీ తన డబ్ల్యూ6 మోడల్‌లో సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీనిని రూ. 10 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రివర్సింగ్ కెమెరా వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్
దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా అందిస్తున్న ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వచ్చిన అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారు. కంపెనీ తన XM (S) వేరియంట్‌లో సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.35 లక్షలు. సన్ రూఫ్ ఫీచర్ తో పాటు టాటా ఆల్ట్రోజ్ లో వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్లు కూడా రానున్నాయి. వీటిని ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ లో ఇప్పటికే పొందుపర్చారు.