ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు కొనుగోలు చేస్తే మీకు రూ. 32,500 వరకూ ఆదా అవుతాయి. ఆలస్యం చేస్తే ఆ తర్వాత అదనంగా మీ మీద భారం పడుతుంది.
ఎలక్ట్రిక్ వాహనం కొనే ఉద్దేశం ఉందా? అయితే ఇదే తగిన సమయం. ఇప్పుడు కొంటే మీకు భారీ తగ్గింపు లభిస్తుంది. ఏథర్ ఎనర్జీ స్కూటర్ పై ఇప్పుడు కొనేలా ఉంటే రూ. 32,500 తగ్గుతాయి. ఆలస్యం చేస్తే ఈ స్కూటర్ మీద ఆ మొత్తం పెరగనుంది. జూన్ 1 నుంచి 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరగనున్నట్లు ఏథర్ ఎనర్జీ కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇచ్చే సబ్సిడీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈవీల ధరలు పెరగనున్నాయి. ఈ క్రమంలో ఏథర్ ఈవీ స్కూటర్ల ధరలు కూడా వచ్చే నెల నుంచి పెరుగుతాయని వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలో కోత కోసిన కారణంగా ఈవీ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. జూన్ 1 నుంచి ఈవీల ధరలు పెరుగుతాయి. మే 31 వరకూ మాత్రమే మునుపటి ధరలు కొనసాగుతాయి. అంటే జూన్ 1 నుంచి ఏథర్ స్కూటర్లపై రూ. 32,500 అదనంగా పెరుగుతుంది. అయితే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకూ ఉంటుందని వెల్లడించింది. ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘మేము పరిశ్రమ యొక్క రోలర్ కోస్టర్ లో నివసిస్తున్నాము. 2019లో సబ్సిడీ రూ. 30 వేలు, 2021లో రూ. 60 వేలు.. అయితే అది ఇప్పుడు 22 వేలకే పరిమితమైంది. ఏది పైకి వెళ్తుందో అది కిందికి రావాలి. ఈ పరిశ్రమ త్వరలోనే తన కాళ్ళ మీద తాను నిలబడాలి’ అంటూ తరుణ్ మెహతా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఏథర్ 450 ఎక్స్ పై రూ. 55,500 ఫేమ్ 2 ఇన్సెంటివ్ ఉండగా.. స్టేట్ సబ్సిడీ రూ. 18,300 ఉంది. ఫేమ్ 2 సబ్సిడీ, ఛార్జర్ తో కలిపి ఎక్స్ షోరూం ధర రూ. 98,079 అవుతుంది. అయితే జూన్ 1 నుంచి రూ. 55,500 ఫేమ్ 2 ఇన్సెంటివ్ లో రూ. 22 వేలు కోత పడనుంది. దీంతో అదనంగా కొనుగోలుదారుల మీద రూ. 32,500 భారం పడనుంది.కాబట్టి ఫేమ్ 2 సబ్సిడీ తగ్గకముందే, ఈవీ స్కూటర్ ధర పెరగకముందే ఈ బండిని కొనుగోలు చేస్తే రూ. 32,500 వరకూ ఆదా అవుతాయని కంపెనీ తెలిపింది. జూన్ 1కి రెండు రోజులే సమయం ఉంది. ఆ తర్వాత స్కూటర్ కొనాలనుకుంటే రూ. 32,500 అదనంగా భారం పడుతుంది.
We live in the most roller coaster of an industry😁
2019 – subsidy goes 🔼 to 30K
2021 – subsidy goes ⏫ to 60K
2023 – subsidy goes 🔻to 22KWhat goes up, must come down.
The industry must stand on its own feet very soon. https://t.co/jH39dUGmjB— Tarun Mehta (@tarunsmehta) May 21, 2023