ఎలాంటి రిస్కు లేకుండా.. కుటుంబాన్ని పోషించగలిగే.. బిజినెస్ ఐడియా కోసం వేచిచూస్తున్నారా! అయితే ఈ వార్త మీ కోసమే. భారతీయ రైల్వేతో కలిసి చేసే ఈ వ్యాపారం ద్వారా చక్కటి లాభాలను పొందవచ్చు. కానీ, అది మీరు ప్లేస్ ను బట్టి, ఎంచుకున్న సమయాన్ని బట్టి ఉంటుంది. ఆ వ్యాపారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్. ఐఆర్ సీటీసీ అనేది రైల్వే అనుబంధ సంస్థ. ఇది ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్, క్యాటరింగ్ సేవలు మొదలైనవాటిని నిర్వహిస్తోంది. మీరు IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా నెల నెలా కొంత మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మీరు ఎలా చెప్పగలరు?.. అన్న సందేహం మీకు రావచ్చు.. అయితెహ్ ఇదీ చదవండి. భారతీయ రైల్వేలో మొత్తం రిజర్వేషన్ టిక్కెట్లలో 55 శాతం ఆన్‌లైన్ మోడ్ ద్వారా బుక్ అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి ఆథరైజ్డ్ IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ గా మారడం వల్ల.. మీకు ఆదాయం ఉంటుందని చెప్పగలం.
ఎంత కమిషన్ ఇస్తారు.
ప్రతి టికెట్ బుకింగ్‌పై ఏజెంట్‌కు కమీషన్ లభిస్తుంది. IRCTC ఏజెంట్‌గా.. మీరు నాన్-AC క్లాస్‌లో PNRకి రూ.20, AC క్లాస్‌లో PNRకి రూ.40 పొందుతారు. దీనితో పాటుగా ఏజెంట్లు రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీ మొత్తంపై 1 శాతం, రూ.2,000 వరకు లావాదేవీ మొత్తంలో 0.75 శాతం చెల్లింపు గేట్‌వే రుసుముగా పొందుతారు.
ఏజెంట్‌గా ఎలా మారాలంటే..
ఎంత సంపాదించగలం..
ఒక ఏజెంట్ నెలకు రూ. 80,000 వరకు సంపాదించవచ్చు. పని నెమ్మదించినా కనీసం 40-50 వేల రూపాయలు రాబట్టవచ్చు. కానీ, అది అయన ఎంచుకున్న పల్స్ ను బట్టి, సమయాన్ని బట్టి ఉంటుంది.
ఏజెంట్‌గా మారడం వల్ల కలిగే ప్రయోజనాలు..
టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు నెలలో ఎన్ని టిక్కెట్లనైనా బుక్ చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. సాధారణ పబ్లిక్ బుకింగ్ టైమింగ్‌లు ప్రారంభమైన 15 నిమిషాలలోపు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే సౌకర్యం, సులభమైన రద్దు ప్రక్రియ.. ఇలా అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఏజెంట్‌కు ఆన్‌లైన్ ఖాతాను రైల్వేస్ అందిస్తుంది. దీని ద్వారా వారు దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం.. మా వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఇస్తున్నాం. మీరు.. దీన్ని బిజినెస్ కు మార్గంగా ఎంచుకోవాలా? వద్దా? అన్నది.. మీరే నిర్ణయించుకోండి. ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.