టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకం సాధించడంతో పీవీ సింధు క్రెడిట్ ని వాడేసుకున్నాయి ప్రముఖ కంపెనీలు. అడ్వర్టైజ్మెంట్ లో ఆమెను సంప్రదించకుండానే ఫొటోలు వాడాయి. లోగోలతో పాటు సింధు ఫోటోను కలిపి అడ్వర్ట్‌యిజ్ చేశాయి. దీంతో సింధు పోర్టుఫోలియోని మేనేజ్ చేస్తున్న స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ బేస్‌లైన్ వెంచర్స్ 15 కంపెనీలకు నోటీసులు పంపింది. ఈ లిస్టులో హ్యాపిడెంట్ (పెర్ఫెట్టి), పాన్ బహర్, యురేకా ఫోర్బ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, ఎంజీ మోటార్, యుకో బ్యాంక్, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, విప్రో లైటింగ్ కంపెనీలు ఉన్నాయి.
ఈ కంపెనీలు బ్రాంజ్ మెడల్ గెలిచినందుకు సింధుకి కంగ్రాట్స్ చెబుతూనే, తమ లోగోలతో కలిపి ఉన్న ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసు కున్నాయి. చాలా కంపెనీలు ప్రస్తుతం జరిగే ఈవెంట్స్‌ను తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. ఎండోర్స్‌మెంట్ పరంగా చూస్తే ఎటువంటి అనుమతి లేకుండా ప్రచారం చేసుకుంటే అది అనైతికమని ఎనలిస్టులు అంటున్నారు. అనుమతి లేకుండా పీవీ సింధు ఫోటో ఉపయోగించినందుకు 20 కి పైగా బ్రాండ్‌లకు నోటీసులు పంపింది బేస్ లైన్ వెంచర్స్.
ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించిన సింధు ఇమేజ్‌ని వాడుకున్నట్లు ఆరోపణలు చేసారు. పలు బ్రాండ్లు ఒలింపిక్స్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి బ్రాండ్ నుండి 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీస్ పంపారు. అధికారి కంగా, IOC భాగస్వాములైన బ్రాండ్‌లు మాత్రమే, ఈ ఫోటోలు ఉపయోగించ డానికి అనుమతించబడతాయి. నిబంధనలను ఉల్లంఘించిన పోస్ట్‌లను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి తొలగించాలని డిమాండ్ చేసారు. మరి కొన్ని బ్రాండ్‌లకు నోటీసులు పంపనున్నారు.