సొంతంగా చిన్న వ్యాపారం చేసుకోవాలనో, లేక వ్యక్తిగత ఖర్చుల కోసమనో లేక వేరే ఇతర ఖర్చుల కోసమనో కొంతమంది బయట అప్పు చేస్తుంటారు. పైగా బంగారమమో, ఇంటి కాగితాలో, ఆస్తి కాగితాలో ఏవో ఒకటి తాకట్టు పెట్టాలి. పైగా వడ్డీ ఎక్కువ. నెల నెలా ఈ అధిక వడ్డీ కట్టడం తప్ప అసలు మాత్రం అలానే ఉంటుంది. దీంతో వడ్డీ భారం, అప్పు భారం విపరీతంగా పడుతుంది. ఒక్కోసారి అసలు కంటే కట్టిన వడ్డీనే ఎక్కువ ఉంటుంది. అదే బ్యాంకులో గనుక లోన్ తీసుకుంటే వాయిదా రూపంలో ప్రతి నెలా అసలు, వడ్డీ తీరిపోతుంటుంది. దీని వల్ల కట్టే వడ్డీ తక్కువ ఉంటుంది. కానీ ఈరోజుల్లో తాకట్టు పెట్టకుండా లోన్లు ఏ బ్యాంకులిస్తున్నాయి అని నిరుత్సాహపడకండి. తక్కువ వడ్డీకి ఎటువంటి తనకా లేకుండా ఆయా బ్యాంకులు వ్యక్తిగత లోన్లు ఇస్తున్నాయి.
ఈ లోన్ కోసం మీ ఆస్తి కాగితాలు తనకా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి లోన్ లేదా కార్ లోన్ కి మాత్రమే ఆస్తి కాగితాలు తనకా పెట్టాల్సి ఉంటుంది. ఈ లోన్ డబ్బుని మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. మీ ఆర్థిక అవసరాలకు, మెడికల్ బిల్లులు, పిల్లల కాలేజ్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు వంటి అవసరాలకు ఖర్చు పెట్టుకోవచ్చు. లేదంటే వ్యాపారం కోసం వాడుకోవచ్చు. కొన్ని అర్హతలు ఉంటే బ్యాంకులు వెంటనే లోన్లు అప్రూవ్ చేస్తాయి. బ్యాంకు ప్రమాణాలకి తగ్గ అర్హతలు ఉంటే మీకు కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల్లో లోన్ ప్రాసెస్ అవుతుంది.
బ్యాంకులో ఖాతా ఉన్న ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వెంటనే లోన్ ఇస్తాయి. లోన్లపై వడ్డీ రేట్లు, నెల నెలా చెల్లించాల్సిన వాయిదా వంటి వివరాలు ఆయా బ్యాంకుల వెబ్ సైట్స్ లో పొందుపరిచాయి. 3 ఏళ్ల కాలపరిమితితో 5 లక్షల లోన్ తీసుకుంటే కనుక ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు, నెల నెలా కట్టాల్సిన వాయిదా వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.
— Hardin (@hardintessa143) November 2, 2022