నెల నెలా కిరాయి ఇళ్లకు వేలకు వేలు చెల్లిస్తున్న రోజులివి. ఇలా చెల్లిస్తూ పోతే ఆ ఇంటి యజమాని బాగు పడతాడే తప్ప.. ఆ ఇంటిలో ఉంటున్న వారి కల ఎప్పటికీ నెరవేరదు. ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే.. అదే డబ్బు ఈఎంఐ రూపంలో కడుతూ సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు. కాకుంటే అందుకు మనకు బ్యాంకులు లోన్ ఇవ్వాలి. మరి బ్యాంకులు ఎంత మేరకు రుణాలిస్తాయి? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఈఎంఐ ఎంత మేర చెల్లించాలి? వంటి పూర్తి వివరాలు మీకోసం..
హోమ్ లోన్ తీసుకునేవారు తిరిగి చెల్లించే ఈఎంఐని బట్టి రుణ మొత్తాన్ని ఎంచుకోవాలి. బ్యాంకులు ఉద్యోగి టేక్-హోమ్ జీతంలో 40% వరకు ఈఎంఐలుగా ఉండడానికి అనుమతిస్తాయి. కాబట్టి, అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. ఆలా అని బ్యాంకులు 100% రుణాన్ని మంజూరు చేయవు. 75 నుంచి 80 శాతం వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. మిగిలినది డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. ఇలా చేయడం వల్ల రుణ ఒత్తిడి, ఈఎంఐ తగ్గుతుంది. ఉదాహరణకు మీరు తీసుకుంటున్న రుణం రూ. 50 లక్షలు అనుకుంటే.. కొన్ని ప్రముఖ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
పైన చెప్పినట్లుగా రుణం రూ. 50 లక్షలు అనుకుంటే.. కాల పరిమితి 20 సంవత్సరాలకు లెక్కకడితే, నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ 40 వేలకు పైనే ఉంటుంది. అయితే.. కాల పరిమితిని పెంచుకోవడం ద్వారా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.
గమనిక: వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గమనించగలరు. అలాగే.. రుణ మొత్తం, రుణ కాలవ్యవధి, రుణ గ్రహీతల ఆదాయం, క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లలో మార్పు ఉండవచ్చు.