ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ తమ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్లకు అధిక లాభం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్ ఆఫ్ బరోడాను చెప్పుకోవచ్చు. నమ్మకమైన బ్యాంక్‌గా, అద్భుతమైన సేవలను కస్టమర్లకు అందిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. తాజాగా తమ కస్టమర్లకు ఈ బ్యాంక్ తీపికబురు అందించింది. వడ్డీ రేట్ల సవరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను భారీగా పెంచుతున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. దీంతో ఈ బ్యాంక్‌లో మనీ దాచుకోవాలనుకునే వారికి చాలా ప్రయోజనం కలుగనుంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ బ్యాంకులు ఎఫ్డీ రేట్లు పెంచేశాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఈ లిస్టులో చేరింది. ఈ దిగ్గజ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను 30 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు వర్తిస్తుంది. ఈ బ్యాంక్‌లో ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్లకు 7.25 శాతం వడ్డీ లభిస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.75 శాతం వరకు వడ్డీని ఇస్తున్నారు. మే 12వ తేదీ నుంచి నూతన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చేశాయి. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచడంతో పాటు బ్యాంక్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌ను కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చింది. ‘బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్’ అనే పథకం ద్వారా ఎఫ్డీలపై 7.25 శాతం వరకు వడ్డీని పొందొచ్చు. దీని మొత్తం టెన్యూర్ 399 రోజులుగా ఉంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు బ్యాంక్ 0.5 శాతం వరకు ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. దీని వల్ల బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి అధిక ప్రయోజనం చేకూరుతుంది.
#BankOfBaroda hikes retail term deposit rates by 30 bps on select tenure
Read here: https://t.co/8Oj36fR3DD pic.twitter.com/CFlbn9ltPt
— Mint (@livemint) May 12, 2023