ఏడాది చివరికొచ్చేశాం.. మరో రెండు రోజుల్లో నవంబర్ నెల పూర్తై.. డిసెంబర్ లో అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో డిసెంబర్ మాసంలో సెలవుల జాబితాను రిజర్వు బ్యాంక్ విడుదల చేసింది. ఈ నెలలో క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకలతో పాటు ఇతర కారణాలతో బ్యాంకులు ఏకంగా 13 రోజులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమైన పనులు ఉన్నట్లయితే కస్టమర్లు ముందుగానే వాటిని పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.
తీరా బ్యాంకుకు వెళ్లి తాళం వేసిఉందని నిరుత్సాహంగా ఇంటికి రావటం కంటే సెలవుల లిస్ట్ చూసుకోవటం ఉత్తమం. ఈ ఉద్దేశ్యంతోనే ఈ వివరాలు అందిస్తున్నాం. బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయనే దానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల ఒక హాలిడే క్యాలెండర్ జాబితాను విడుదల చేస్తుంది. దీని ఆధారంగానే వివరాలు ఉంటాయి. బ్యాంకులు మూసి ఉన్నా ఆన్‌లైన్ సర్వీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా పూర్తి చేసే పనులుంటే బ్యాంకు సెలవులతో ఇబ్బంది లేదు.
గమనిక: ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర విషయాల ఆధారంగా సెలవులు ఉంటాయి. జాతీయ స్థాయిలో డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో బ్యాంకులు ఏకకాలంలో మూసి ఉంటాయి. డిసెంబర్ 24న, క్రిస్మస్, నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఇలా బ్యాంకులు కొన్ని రాష్ట్రాల్లో మూసి ఉంటాయి.