బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య అలెర్ట్. ఏప్రిల్ నెలలో బ్యాంకులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. ఏమైనా ముఖ్యపనులున్న వారు సెలవుల వివరాలు ముందుగా తెలుసుకొని అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది.
బ్యాంకు ఖాతాదారులారా.. మీకో ముఖ్య గమనిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసి.. ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న క్రమంలో అనేక మార్పులు జరగనున్నాయి. అందులో ముఖ్యమైనది.. పాన్-ఆధార్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇంకా ఏప్రిల్ నెలలో బ్యాంకులు సెలవుల కారణంగా 15 రోజులు మూతపడనున్నాయి. కావున మీకు ఏవైనా బ్యాంకులకు సంబంధించిన పనులు ఉంటే ముందుగా సెలవుల వివరాలు అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇందులో వారాంతపు సెలవులు కూడా కలిపి ఉన్నాయి. ఏప్రిల్ నెలలో.. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి వంటి అనేక పర్వదినాలు, జయంతులు ఉన్నవి కావున సెలవుల జాబితా పెద్దగానే ఉంది. బ్యాంకుల సెలవుల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. కావున, ఖాతాదారులను ఇబ్బందుల నుంచి రక్షించడానికి ఆర్‌బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది.
గమనిక: సెలవుల జాబితా అనేది ఆయా రాష్ట్రాల వారిగా వేరు వేరుగా ఉంటుంది. బ్యాంకుల సెలవు దినాల్లో మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆన్‌లైన్ సౌకర్యాల ద్వారా ఖాతాదారులు తమ పనులు పూర్తి చేసుకోవచ్చు.