దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR)ను 70 బేసిస్ పాయింట్లు 0.70 శాతం)పెంచింది. దీంతో బీపీఎల్ఆర్ 13.45 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన బీపీఎల్ఆర్ రేటు కారణంగా లోన్ అకౌంట్ల మీద ప్రభావం పడనుంది. దీంతో బీపీఎల్ఆర్ తో లింక్ అయి ఉన్న రుణాల చెల్లింపులు ఖరీదుగా మారనున్నాయి. 12.75 శాతం ఉన్న బీపీఎల్ఆర్ ను 13.45 శాతానికి పెంచుతూ బుధవారం నాడు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీపీఎల్ఆర్ ఏడాదికి 13.45 శాతంగా ఉంటుందని, అది సెప్టెంబర్ 15 నుండి అమలు అవుతుందని ఎస్బీఐ బ్యాంకు వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది.
అంతేకాదు బేస్ రేటుని కూడా 8.7 శాతం బేసిస్ పాయింట్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా ఇవాళ్టి నుంచే అమలు అవుతోంది. ఈ కారణంగా బేస్ రేట్స్ తో రుణాలు తీసుకున్న కస్టమర్లకు ఈఎంఐ అమౌంట్ పెరగనుంది. అయితే బీపీఎల్ఆర్, బేస్ రేటు అనేవి రుణాలను పంపిణీ చేసేందుకు ఉపయోగించే పాత బెంచ్ మార్క్ లు. ఇప్పుడు చాలా వరకూ బ్యాంకులు ఎక్స్టర్నల్ బేసిడ్ లెండింగ్ రేట్ (EBLR) లేదా రెపో లింకిడ్ లెండింగ్ రేట్ (RLLR) మీద రుణాలు ఇస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను బ్యాంకులు పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో.. ఆర్బీఐ తన పాలసీ రేట్లను కూడా పెంచుతుంది. ఈ పాలసీ మీటింగ్ ఈ నెల 28 నుండి 30 వరకూ మూడు రోజుల పాటు జరగనుంది.
ఎస్బీఐ బ్యాంకు బీపీఎల్ఆర్, బేస్ రేటుని త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంటుంది. అంటే ప్రతీ మూడు నెలలకొకసారి ఈ రేట్లను సవరిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎస్బీఐ సవరించిన ఈ లెండింగ్ రేటుని మిగతా బ్యాంకులు కూడా అనుసరించనున్నాయి. ఎస్బీఐతో పాటు మిగిలిన బ్యాంకులు కూడా ఈ రేట్లను సవరించనున్నాయి. బేస్ రేటు అనేది కస్టమర్లకు రుణాలు మంజూరు చేసేందుకు విధించే కనీస వడ్డీ రేటు. ఇక బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు అనేది రుణాలపై వడ్డీలను లెక్కించేందుకు వినియోగించే సగటు రేటు. ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంకు బేస్ రేటు ఆధారంగా కస్టమర్లకు రుణాలు ఇస్తోంది. బీపీఎల్ఆర్ 13.45 శాతానికి, బేస్ రేటు 8.7 శాతానికి పెంచడంతో వడ్డీ రేటు పెరిగింది. దీంతో సామాన్యులపై మరోసారి భారం పడినట్టయ్యింది. మరి ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంచడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
#SBI raises the benchmark prime lending rate by 70 basis points to this, check details#BPLR | #Finance https://t.co/dIW9dt4k1m
— DNA (@dna) September 15, 2022