మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. యాక్సిస్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఏడాదికి మూడు విమాన టికెట్లు ఉచితంగా పొందవచ్చు.
నిత్యం విమాన ప్రయాణాలు చేస్తుంటారా..? వ్యాపార అవసరాలు లేదా విహార యాత్రలు.. అంటూ ఒక పని నిమిత్తం తరచూ ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. తరచూ విమాన ప్రయాణాలు చేసేవారిని దృష్టిలో ఉంచుకొని యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక క్రెడిట్ కార్డుని తీసుకొచ్చింది. విస్తారాతో కలిసి ఈ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.1,500 కాగా, దీనికి పన్నులు అదనం. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? రివార్డు పాయింట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న భారత పౌరులు ఎవరైనా ఈ కార్డుతీసుకోవచ్చు. అయితే వార్షికాదాయం రూ.6 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
కాంప్లిమెంటరీ బెనిఫిట్ కింద ఎకానమీ క్లాస్ టికెట్ వోచర్‌ను వెలకమ్ గిఫ్ట్‌గా ఇస్తారు. ఈ వోచర్‌ను కార్డుదారుల క్లబ్ విస్తారా ఖాతాకు జత చేస్తారు. జారీ చేసిన దగ్గరి నుంచి మూడు నెలలలోపు దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
కార్డుదారులు ఖర్చు చేసే ప్రతి రూ.200 కొనుగోలుపై రెండు క్లబ్ విస్తారా పాయింట్లు జత చేస్తారు. ఈ పాయింట్లను విమాన టికెట్ల కొనుగోలు చేసే సమయంలో రీడీమ్ చేసుకోవచ్చు.
ఈ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా బేస్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తారు. ఈ కార్డు ద్వారా జారీ చేసిన 90 రోజుల్లోపు రూ.50,000 ఖర్చు చేస్తే 1,000 సీవీ(క్లబ్ విస్తారా) పాయింట్లు బోనస్ కింద వస్తాయి. అలాగే నిర్దేశించిన మేర ఖర్చు చేస్తే మైల్‌స్టోన్ ప్రయోజనాల కింద 1,000 బోనస్ సీవీ పాయింట్లు అదనంగా ఇస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మూడు కాంప్లిమెంటరీ విమాన టికెట్లు ఉచితంగా పొందవచ్చు.
అదెలా అంటే.. రూ.1,25,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఒక ఎకానమీ క్లాస్ టికెట్, ఖర్చు రూ.2,50,000 దాటితే మరో ఎకానమీ క్లాస్ టికెట్, ఇక రూ.6 లక్షలపైన ఖర్చు చేస్తే ఇంకో ఎకానమీ టికెట్ ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ టికెట్లు దేశీయ ప్రయాణాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అది కూడా టికెట్లు జారీ అయిన ఆరు నెలల్లోగా వీటిని వినియోగించుకోవాలి. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఈజీడైనర్ ప్రోగ్రాంలో ఉన్న రెస్టారెంట్లలో భోజనం చేస్తే 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.800 వరకు రాయితీ పొందవచ్చు.