ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? రూ. 25 లక్షల బడ్జెట్ లో ఏ ఏరియాలో ఫ్లాట్ దొరుకుతుందని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం.
అద్దె ఇంట్లో ఉండడం కంటే సొంత ఇంటిలో ఉంటే వచ్చే ఆనందమే వేరు. అయితే తక్కువ బడ్జెట్ లో సిటీలోనే మంచి ఏరియాలో ఫ్లాట్ దొరికితే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఏరియా ఎదురుచూస్తుంది. హైదరాబాద్ సిటీలో అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే ఏరియాలో కొత్త ఫ్లాట్ కొనాలనుకునేవారికి మణికొండ ఏరియా ఉత్తమం అని చెప్పవచ్చు. ఈ ఏరియాలో రూ. 20 లక్షల నుంచి ఫ్లాట్స్ అనేవి దొరుకుతున్నాయి. ఓనర్లు, బిల్డర్ ఫ్లోర్లు అందుబాటులో ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ జోన్ లో ఉన్న మణికొండ ఏరియా అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ ఏరియా కూడా రియల్ ఎస్టేట్ పరంగా బాగా డెవలప్ అయ్యింది.
ప్రస్తుతం ఈ ఏరియాలో చదరపు అడుగు సగటున రూ. 5,400 పలుకుతోంది. అదే బిల్డర్ ఫ్లోర్ అయితే సగటున చదరపు అడుగుకు రూ. 4,700 పలుకుతోంది. ఈ బిల్డర్ ఫ్లోర్ల వృద్ధి రేటు అనేది ఏడాదిలో 2.2 శాతం పెరిగింది. ఇక నాన్ బిల్డర్ ఫ్లాట్స్ అయితే ఏడాదిలో 9.2 శాతం పెరిగింది. ఏడాదిలో ల్యాండ్ ట్రాన్సక్షన్స్ 12 జరగగా, అపార్ట్మెంట్స్ ట్రాన్సక్షన్స్ 113 జరిగాయి. ఇక విల్లాలు ఐతే 6 ట్రాన్సక్షన్స్ మాత్రమే జరిగాయి. ట్రాన్సక్షన్స్ అంటే క్రయ విక్రయాలు. స్థలం, అపార్ట్మెంట్, విల్లాలు మూడింటిలో ఎక్కువగా అపార్ట్మెంట్లే సేల్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఫ్లాట్ కొనడం అనేది ఉత్తమమైన ఛాయిస్. మణికొండలో 600 చదరపు అడుగుల 1 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే సగటున రూ. 32,40,000 అవుతుంది. 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఐతే సగటున రూ. 54 లక్షలు అవుతుంది.
అదే బిల్డర్ ఫ్లోర్ ఐతే 1 బీహెచ్‌కేకి రూ. 28 లక్షలవుతుంది. ఇంతకంటే తక్కువకు కూడా దొరుకుతున్నాయి. 2 బీహెచ్‌కే బిల్డర్ ఫ్లోర్ ఐతే రూ. 47 లక్షల్లో దొరుకుతుంది. బిల్డర్ ద్వారా ఫ్లాట్ కొనాలనుకుంటే లోన్ సదుపాయం కూడా కల్పిస్తారు. నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకూ ఈఎంఐ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ దగ్గర కొనుగోలు చేస్తే లోన్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. అద్దె కట్టడం కంటే ఈఎంఐ కట్టడం ద్వారా ఫ్లాట్ సొంతం చేసుకోవడం మేలు అనుకునేవారికి ఈ ఏరియా ఉత్తమం అని చెప్పవచ్చు. ఈ ఏరియా దగ్గరలో ఆఫీస్ కి వెళ్లేవారికి ఇంకా బాగుంటుంది. పైగా ఈ ఏరియాలో అద్దె దిగుబడి కూడా బాగుంది. ఏడాదిలో 4 శాతం పెరిగింది. మీరు ఇన్వెస్ట్ చేసి అద్దెకు ఇచ్చినా లాభాలు ఉంటాయి. ఇదే మణికొండ ఏరియాలో తక్కువ స్పేస్ లో రూ. 14 లక్షలు, రూ. 18 లక్షలు, రూ. 22 లక్షలు, రూ. 25 లక్షలకు కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఇవి రీసేల్ ప్రాపర్టీలు. ఈ ఫ్లాట్లు కట్టి 5 సంవత్సరాలు కూడా దాటలేదు.