వ్యాపారం చేయాలనీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ, ప్రారంభించాలంటే భయం. ప్రతి రోజు లాభాలు వస్తాయా..? నష్టాలు వస్తే ఏం చేయాలి..? అంటూ వారంతకు వారే తికమక ప్రశ్నలు వేసుకుంటూ ఏ వ్యాపారం చేయకుండా కాలం వెల్లదీస్తుంటారు. అలాంటి వారికి ఈ వ్యాపారం సరిగ్గా సరిపోతుంది. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే, ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. ఈ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి..? ఆదాయం ఎలా వస్తుంది..? వంటి పూర్తి వివరాలు మీకోసం..
దేశంలో సరైన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఒకవైపు.. ఆశించిన జాబ్ రాలేదని ఏ ఉద్యోగమూ చేయని చదువుకున్న నిరుద్యోగులు మరోవైపు. మనము ఇంకొకరి కింద పని చేయాలా.. ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకునేవారు మరికొందరు. వ్యాపారం చేద్దామంటే కొందరికి డబ్బులుండవు.. మరికొందరేమో డబ్బులుంటాయి. కానీ, ఏ బిజినెస్ అయితే బాగుంటది అన్న ప్రశ్న మొదలై అలానే ఆగిపోతున్నారు. అలాంటి వారికి సరికొత్త ఐడియా.. ఏటీఎం ఫ్రాంఛైజ్.
ఏటీఎం ఫ్రాంఛైజ్ అంటే ఏంటి అంటారా?. మనం డబ్బులు అవసరమైన ప్రతిసారి ఏటీఎంకు వెళ్లి డ్రా చేస్తుంటాం. ఇలా మనం చూసే ఏటీఎంలన్నీ ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంకు, యాక్సిస్.. ఇలా మనకు తెలిసినవే ఎక్కువుగా కనబడుతుంటాయి. ఇవి ఆయా కంపెనీలు సొంతంగా ఏర్పాటు చేసుకునేవి. ఇవి కాకుండా.. అక్కడక్కడ ఇండీక్యాష్, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఇలాంటి కనిపిస్తుంటాయి. ఇవి ఆర్బీఐ నుంచి పర్మిషన్ తెచ్చుకొని.. ఒక్కో ట్రాన్సక్షన్(అమౌంట్ డిపాజిట్ చేయడం, డ్రా చేయడం) చేస్తే సదరు బ్యాంకు ఇంత కమిషన్ ఇవ్వాలి అన్నట్లుగా ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేస్తాయి. మీరు కూడా ఈ కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని, వాటి ద్వారా ఏటీఎంలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పొందొచ్చు.ఏటీఎం ఏర్పాటు చేయాలంటే.. ముందుగా అందుకు అనువైన స్థలం ఎంచుకోవాలి. స్థలం విస్తీర్ణం 50 నుంచి 80 చదరపు అడుగుల ఉండాలి. ఇతర ఏటీఎంలకు 100 మీటర్ల దూరం ఉండాలి. 24 గంటల పవర్ సప్లై చాలా అవసరం. 1 కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవసరం అవుతుంది. ఏటీఎం ద్వారా రోజుకు 300 ట్రాన్సాక్షన్లు జరిగే స్థలాన్ని ఎంచుకోవడం ఉత్తమం. అందుకే.. పబ్లిక్ ఎక్కువుగా తిరిగే ప్రదేశాలు అయితే చాలా బెటర్. ట్రాన్సాక్షన్లు పెరిగేకొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది.
మనం ఏటీఎం ఫ్రాంఛైజ్ తీసుకోవాలనుకుంటే.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, ఫోటో, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ లతో పాటు మరిన్ని వివరాలను అందించాల్సి ఉంటుంది. ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం, టాటా ఇండిక్యాష్ ఏటీఎంలలో.. మనకు నచ్చిన దానిని ఏర్పాటు చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షల రూపాయలు, మూలధన క్యాపిటల్ కింద 3 లక్షల రూపాయలు చెల్లించి ఏటీఎం ఫ్రాంఛైజీ తీసుకోవచ్చు. తక్కువ సమయంలోనే పెట్టుబడికి రెట్టింపు లాభాలను పొందవచ్చు. ప్రతిరోజూ 400 లావాదేవీలు జరిగితే సులభంగా నెలకు 60,000 రూపాయలు సంపాదించవచ్చు. కంపెనీల వెబ్ సైట్లలో లాగిన్ కావడం ద్వారా ఏటీఎం ఫ్రాంఛైజ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఏటీఎం ఫ్రాంఛైజ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.