హైదరాబాద్ లో స్థలం కొనాలని అనుకుంటున్నారా? ఇప్పుడు కొనకపోయినా గానీ అసలు ఎంత రేటు ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ లో ప్రముఖ ఏరియాల వారీగా స్థలాల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పందెం కోడిలా పుంజుకుంటుంది. పెట్టుబడులకు స్వర్గధామంగా మారడంతో పలు ఐటీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో భూమి డిమాండ్ అనేది పెరిగిపోతోంది. హైదరాబాద్ లోని కేవలం కొన్ని ప్రాంతాలనే కాకుండా దాదాపు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడంతో ప్రతి చోటా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యులకు అందడం లేదన్న విషయం పక్కన పెడితే సొంత భూములు, స్థలాలు ఉన్నవారికి, ఎప్పుడో కొని పక్కన పెట్టిన వారికి ఇప్పుడు కోట్లలో లాభాలను తెచ్చిపెడుతుంది.
2023 గణాంకాల ప్రకారం యావరేజ్ స్థలం ధరలు చూసుకుంటే.. ముంబైలో చదరపు అడుగు రూ. 945 ఉండగా.. చెన్నైలో రూ. 4446 ఉంది. ఢిల్లీలో రూ. 5,327 ఉండగా.. హైదరాబాద్ లో రూ. 4500 ఉంది. అంటే హైదరాబాద్ లో గజం స్థలం కొనాలంటే యావరేజ్ గా రూ. 40,500. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఇంటి స్థలానికి 150 గజాలు కావాల్సి వస్తుంది కాబట్టి రూ. 60,75,000 అవుతుంది. సిటీలో ఉన్న ఏరియాలనే కాకుండా సిటీకి దూరంగా ఉన్న జహీరాబాద్ లాంటి ప్రాంతాల అభివృద్ధిపై ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకోనుండడంతో ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోనుంది. ఇది ఎప్పుడూ ఉండేదే గానీ.. అసలు హైదరాబాద్ లో స్థలం రేట్లు ఎంతున్నాయి? ప్రభుత్వ ధరల ప్రకారం ప్రభుత్వ భూములు గానీ తెలంగాణలో పలు ఏరియాల్లో ఉన్న భూముల ధరలు గానీ ఎంత పలుకుతున్నాయో చూసేయండి.
ఇవే హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వ ధరలు. అతి తక్కువగా సదాశివపేటలో ఉండగా.. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. ఇవి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వెల్లడించిన గణాంకాలు. ఈ ధరలకు, బయట మార్కెట్ లో ఉన్న ధరలకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ధరల కంటే ఎక్కువ ధరలు ఉండచ్చు. ఈ ధరలు కేవలం మీకు ఒక అంచనా రావడానికి మాత్రమే. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ధరలు ఎలా ఉంటాయో అని మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ ధరల జాబితా ఉపయోగపడుతుంది. ఒరిజినల్ గా ఎంత ఉన్నాయన్నది బయట మార్కెట్లో తెలుసుకోవాల్సిందిగా మనవి.