ప్రముఖ టెక్ సంస్థ యాపిల్.. ఇండియా మీద ఫోకస్ పెడుతోంది. ఆ కంపెనీ ఇక్కడ రాబోయే మూడేళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వనుందని తెలుస్తోంది.
టెక్ దిగ్గజం యాపిల్.. భారత్‌పై ఫోకస్ పెడుతోంది. చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనన్పటి నుంచి యాపిల్‌కు అక్కడ కష్టాలు మొదలయ్యాయి. యాపిల్ ప్రాడక్ట్స్ తయారీ, సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో తమ ఉత్పత్తుల తయారీని చైనా నుంచి ఇతర దేశానికి మార్చాలని.. యాపిల్ సంస్థ తయారీదారులకు సూచించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా వైపు దృష్టి పెడితే బాగుంటుందని తెలిపింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా వరల్డ్‌లోనే అతిపెద్ద రెండో కంపెనీగా ఉన్న యాపిల్ తాజా నిర్ణయంతో తయారీ సంస్థలు భారత్‌లో తయారీ యూనిట‍్లను నెలకొల్పేందుకు రెడీ అయ్యాయి. దీంతో ఇక్కడ లక్షలాది మందికి ఉపాధి దొరకనుంది.
ఇప్పటికే భారత్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపిన యాపిల్ సంస్థ.. 2024 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 1.20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందంటూ స్టాఫింగ్ కంపెనీ టీమ్ లీజ్ సర్వీస్ ఎకనమిక్స్ టైమ్స్‌కు తెలిపింది. అందులో 40 వేల మందికి ప్రత్యక్షంగానూ.. 80 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పించనుందని తెలుస్తోంది. 2026 నాటికల్లా మొత్తంగా 3 లక్షల మందిని విధుల్లోకి తీసుకోనుందట. వారిలో లక్ష మంది ప్రత్యక్షంగా, 2 లక్షలకు పైగా మంది పరోక్షంగా లబ్ధి పొందనున్నారట. ఈ సందర్భంగా 36 నెలల్లో ప్లాంట్లు, ఫ్యాక్టరీల ఏర్పాటుతో మరో లక్ష మందిని యాపిల్ నియమించుకోనుందని టీమ్ లీజ్ కంపెనీ సీఈవో కార్తిక్ నారాయణ్ తెలిపారు.
On the last earnings call, #Apple CEO #TimCook said the company is putting “a lot of emphasis on the market” and compared the current state of its work in #India to its early years in #China. https://t.co/H7SX53Yrau
— Mint (@livemint) March 11, 2023