సాఫ్ట్ వేర్.. అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు. సాఫ్ట్ వేర్ రంగంలో వీటికి పెట్టింది పేరు. అలాంటి కంపెనీల్లో ఉద్యోగం అంటే ఆ ఆనందమే వేరు. అందునా ఏడాదికి రూ.6 – రూ.8 కోట్ల జీతమంటే.. మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా బుద్ధిగా బాస్ చెప్పిన డేట్ కు పక్కాగా ఆఫీసుకు వెళ్లిపోతారు. కానీ, మనం చెప్పబోయే వ్యక్తి దీనికి పూర్తిగా భిన్నం. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి.. ఆఫీస్ కు రమ్మంటారా అని వింత నిర్ణయం తీసుకున్నాడు. నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ రిజైన్ చేశాడు. ప్రస్తుతం ఈ రిజిగ్నేషన్ అంశం యాపిల్‌తో పాటు ఇతర టెక్ కంపెనీల్లోనూ చర్చాంశనీయంగా మారింది.
సుధీర్ఘ కాలం తర్వాత ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెబుతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. అయితే ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు కోట్లలో శాలరీ తీసుకుంటున్నా..ఉన్న ఫళంగా జాబ్ కు రిజైన్ చేస్తున్నారు. ఆఫీస్‌కు రావాలంటే కుదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే చేస్తాం. లేదంటే జాబ్ రిజైన్ చేస్తామంటూ బాస్‌లకు మెయిల్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇయాన్ గుడ్‌ఫెలో ఆ సంస్థకు భారీ షాక్ ఇచ్చారు. ఆఫీస్ అమలు చేసిన కొత్త రూల్ కారణంగా తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: China: కంపెనీ బంపరాఫర్: పిల్లల్ని కంటే లక్షల్లో బోనస్.. ఏడాది పాటు సెలవులు!
ఓ నివేదిక ప్రకారం, ఇయాన్ గుడ్‌ఫెలో జీతం సంవత్సరానికి రూ.6 కోట్ల నుండి రూ.8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2016 నుంచి టెస్లాలో పని చేసిన అతని శాలరీ సంవత్సరానికి కనీసం రూ.6 కోట్లుగా ఉందని, టెస్లాకు రిజైన్ చేసిన గూగుల్‌లోకి వెళ్లడంతో అతని శాలరీ పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2019లో యాపిల్‌లో చేరిన గుడ్ ఫెలో శాలరీ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం పలు నివేదికలు పేర్కొన్నాయి.
Apple’s director of machine learning, Ian Goodfellow, quits job as the company passes a return to work policy. Goodfellow had been with Apple for nearly three years, having joined the company’s Special Projects Group in April 2019.#Apple https://t.co/UhMCsY0Ate pic.twitter.com/w7QUJccWHq
— Analytics Drift (@AnalyticsDrift) May 10, 2022
అయితే.., ఇటీవల యాపిల్ సంస్థ తన ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపునిచ్చింది. హైబ్రిడ్ వర్క్ మోడల్ పాలసీని అమలు చేసింది. కొత్త వర్క్ పాలసీ ప్రకారం.. ఉద్యోగులు ఏప్రిల్ 11నుంచి వారానికి కనీసం ఒక రోజు, ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత అది కాస్త మే 2 నుంచి వారానికి రెండు రోజులకు పెరిగింది. ఇప్పుడు, యాపిల్ తన ఉద్యోగులను కనీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. మే 23 నుంచి వారానికి 5రోజులు పనిచేయాలని కొత‍్త పాలసీలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై గుడ్‌ఫెలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన టీంలో పని చేసేవారికి మరింత వెసులుబాటు ఉండేలా నిర్ణయాలు ఉంటేనే.. ప్రొడక్టివిటీ బాగుంటుందని తాను నమ్ముతానని అతను వాదిస్తున్నాడు. అందుకే.. తాను సంస్థను వీడుతున్నట్లుగా స్పష్టం చేశాడు.