సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. మరో ఐటీ దిగ్గజ సంస్థ లేఆఫ్స్‌కు తెరతీసింది. ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటన చేసింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న టెక్ కంపెనీల ఉద్యోగుల తొలగింపులో ఇదే అతి పెద్ద లేఆఫ్స్ కావడం గమనార్హం.
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటన చేసింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న టెక్ కంపెనీల ఉద్యోగుల తొలగింపులో ఇదే అతి పెద్ద లేఆఫ్స్ కావడం గమనార్హం.
దాదాపు 19,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ఐటీ దిగ్గజం యాక్సెంచర్ గురువారం ప్రకటన చేసింది. ఇది సంస్థ ఉద్యోగుల్లో 2.5 శాతంగా ఉంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ వార్షిక ఆదాయం, లాభాల అంచనాలను కూడా తగ్గించుకోవాలని యాక్సెంచర్ నిర్ణయించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ ఒక కారణమని తెలిపింది. ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న బ్యాంకింగ్ సంక్షోభం కూడా ఆర్థిక మాంద్యానికి మరింత ఆద్యం పోస్తోంది.
ఐతే, లేఆఫ్స్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది చివరిలో కొత్త నియామకాలు కూడా చేపడతామని యాక్సెంచర్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే విషయం. కాగా, ఇప్పటికే గూగుల్, అమెజాన్, విప్రో, మెటా సహా పలు టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను బయటకి నెట్టేసిన సంగతి తెలిసిందే. అయితే, అతిగా రిక్రూట్ చేసుకోవడం కూడా లేఆఫ్స్ కు ఒక కారణమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. రిక్రూట్ చేసుకునేటప్పుడు వారి నైపుణ్యాలను పూర్తి స్థాయిలో తెలుసుకోకపోవడం.. అనంతరం వారు స్థాయిగా తగ్గట్టుగా రాణించలేకపోవడంతోనే తొలగిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఐటీ రంగంలో కొనసాగుతోన్న ఉద్యోగాల తొలగింపుపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Accenture to layoff 19,000 employees, trims annual revenue growth.
Read More: https://t.co/gLvXFnJ6km pic.twitter.com/ZSWbHWAGLv
— TIMES NOW (@TimesNow) March 23, 2023