మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్ఫూర్తిదాయక కథనాలను షేర్ చేస్తూ ఉంటారు. అలానే స్వశక్తిని నమ్ముకుని.. తమ కాళ్ల మీద తాము నిలబడి బతుకుతున్న వారిని ప్రశంసించడమే కాక.. వారికి తోచిన రీతిలో సాయం చేస్తారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన ట్విట్టర్ లో ఓ అద్భుతమైన వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. దానిలో ఉన్న యువకుడిపై ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..
ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ‘‘నమ్మశక్యం కాని ధైర్యం.. ఈ రోజు ఇంత మంచి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. నా వారాన్ని ప్రారంభించాను. అపురూపమైన నిస్వార్థ గుణం ఇది. మహోన్నత ఇండియా.. మన చుట్టూనే ఎందరో స్ఫూర్తిదాయక వ్యక్తులున్నారు’’ అంటూ ఆనంద్ మహీంద్రా వీడియోని షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి తన ప్రాణాలు పణంగా పెట్టి.. ఎంతో సాహసంతో.. రైలు పట్టాలపై పడిన బాలికను కాపాడతాడు. మధ్యప్రదేశ్, భోపాల్ లో బర్ఖేడీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి : రైతుకు అవమానం.. తప్పు సరిదిద్దుకున్న మహీంద్రా కంపెనీ..వీడియోలోని వ్యక్తి పేరు మెహబూబ్. ఫిబ్రవరి 5న, మెహబూబ్ తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా.. కొంతమంది రైల్వే ట్రాక్ దాటేందుకు వేచి ఉన్నారు. ఆ తర్వాత రైలు ఆగడంతో ప్రజలు ట్రాక్ దాటడం మొదలు పెట్టారు. అయితే.. కొద్దిసేపటికే ఘటనా స్థలంలో అలజడి వినిపించింది. మెహబూబ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చూడగా బాలిక రైలు పట్టాలపై పడిపోయింది. బాలిక ఎదురుగా రైలు వస్తున్న విషయాన్ని గనించని జనాలు అరవడం మొదలుపెట్టారు. షాక్‌లో ఉన్న అమ్మాయి లేచి నిలబడలేకపోయింది.
పరిస్థితి గమనించిన మెహబూబ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ట్రాక్ వైపు దూసుకెళ్లి పట్టాలపైకి దూకాడు.. బాలికను సురక్షితంగా తీసుకువెళ్లడానికి సమయం లేకపోవడంతో.. మెహబూబ్ ట్రాక్ మధ్యలో ఆమె వైపు పాక్కుంటు వెళ్లాడు. అనంతరం బాలిక బ్యాగ్‌ని తీసుకుని ఆమె తలపై ఉంచి కిందికి అదిమి పట్టుకుంటాడు. వీడియోలో రైలు వారి మీదుగా వెళుతున్నప్పుడు మెహబూబ్ అమ్మాయి చేయి పట్టుకుని ఆమెను రక్షించుకోవడం చూడవచ్చు. రైలు వెళ్లిపోయిన తర్వాత వారిద్దరూ క్షేమంగా అక్కడి నుంచి బయటపడ్డారు.
ఇది కూడా చదవండి : మంత్రి కేటీఆర్ కు ధ్యాంక్స్ చెప్పిన ఆనంద్ మహీంద్ర
ఎవరో ముక్కు, ముఖం తెలియని అమ్మాయి కోసం మెహబూబ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పట్టాల మీదకు దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజనలు మెహబూబ్ సాహసంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు లైక్ చేయడమే కాదు విపరీతంగా షేర్ చేశారు. అలా అది కాస్త ఆనంద్ మహీంద్ర దృష్టిలో పడటంతో ఆయన రీట్వీట్ చేశారు. మెహబూబ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I start the week by recalling this incident. Incredible courage; incredible selflessness. Incredible India. There are role models all around us. #MondayMotivation https://t.co/yLXN7rZfK1
— anand mahindra (@anandmahindra) February 14, 2022