పారశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత.. నిత్యం ఊపిరిసలపని పనులతో బిజీగా ఉంటారు. అయితే తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. స్ఫూర్తిదాయక కథనాలు, వ్యక్తుల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రతిభ ఉండి.. ఆదరణకు నోచుకోనివారికి తన వంతు సాయం చేస్తారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. స్టార్ హీరోలతో పోటీ పడుతుంటారు. ఆయన చేసే ట్వీట్స్ కోసం నెటిజనులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక ఆయన కూడా స్ఫూర్తివంతమైన కథనాలతో పాటు.. సమకాలీన అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రసుత్తం ప్రపంచం అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం మీదే నడుస్తోంది. కరెంట్ లేకపోతే.. మనిషి కాసేపు కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఓ రోజంతా గాడ్జెట్స్‌కి దూరంగా ఉండటం అంటే.. ప్రపంచంతో సంబంధాలు తెగినట్లే అని భావించే పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్న ఓ యంత్రం ప్రతి ఒక్కరని అబ్బురపరుస్తోంది. దీన్ని చూసిన వారంతా.. టాలెంట్, నైపుణ్యం, వగైరా పదాలకు అసలు సిసలు అర్థం ఇది కదా అంటున్నారు. మరి ఇంత అద్భుతమైన ఐడియా ఆనంద్ మహీంద్రా దృష్టికి రాకుండా ఉంటుందా. వచ్చింది.. ఆయనకు నచ్చింది.
ఈ యంత్రం ఆనంద్ మహీంద్రా మనసు దోచిందని చెప్పవచ్చు. వెంటనే వీడియో చూడగానే.. ఆయన దీన్ని తన ట్విట్టరలో రీట్వీట్ చేస్తూ.. ప్రశంసల వర్షం కురిపించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతమైంది. అందమైంది. ఈ ‘ప్రిమిటివ్’ మెకానికల్ డివైస్ అద్బుతంగా, అందంగా ఉంది. సస్టైనబుల్, సమర్ధవంతమైంది మాత్రమే కాదు. కదులుతున్న శిల్పంలా ఉంది అంటూ ఆయన కామెంట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. లైక్‌లు, కమెంట్లు వెల్లువలా వస్తున్నాయి.
గ్రామాల్లో పొలాల్లోని నీటిని తోడే యంత్రంలాగా, మరోవైపు ఆహార ధాన్యాలను దంచుకునే దంపుడు సాధనం లాగా, పక్కనే ప్రవహిస్తున్న నీటి ద్వారా విద్యుత్తును తయారు చేసేందుకు ఉయోగించేలా ఇలా బహుళ ప్రయోజనాలు నేరవేర్చేలా రూపొందించిన ఈ యంత్రం, దాని పని తీరు.. చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘నాకు డిజైనింగ్‌లో పెద్దగా నైపుణ్యం లేదు.. కానీ ఇది మాత్రం సూపర్ అని చెప్పగలను సార్. బరువు, మోషన్ కంట్రోలింగ్‌లో చాలా నైపుణ్యం ఉంది ఇందులో. అంతేకాదు ఈ వీడియోలోని మహిళ ఫోకస్, ప్లో మెచ్చుకోదగింది అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
వావ్.. పొలాల్లోకి నీటిని పంప్ చేయడానికి ఉపయోగించే చాలా పురాతనమైన పద్దతి ఇది. నా బాల్యాన్ని గుర్తుచేశారు. థ్యాంక్యూ సర్. ఇది చూసినందుకు సంతోషంగా ఉందని మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతోంది ఈ డివైస్. ఒకవైపు హైడ్రాలిక్ పవర్, మరోవైపు వాటర్ పంపింగ్.. అలాగే మహిళ ఒడ్లు లాంటివేవో దంచుతోంది. ఈ టెక్నాలజీ అదిరిపోయిందంటూ అబ్బురపడుతున్నారు.. అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
यह उपकरण कुशल भी है और खूबसूरत भी। In an age where we’re surrounded by electronic gadgetry, this ‘primitive’ mechanical device is not just efficient & sustainable but also stunningly beautiful. Not just a machine but a mobile sculpture… pic.twitter.com/JzhDmYriCw
— anand mahindra (@anandmahindra) July 28, 2022