మనిషిలో టాలెంట్ ఉంటే సరిపోదు.. దాన్ని గుర్తించి.. ప్రోత్సాహించే వారు దొరికినప్పుడు మాత్రమే ఆ ప్రతిభకు తగిన సార్థకత లభిస్తుంది. చదువు విషయంలో ప్రతిభ కనబరిస్తే.. అందరూ ప్రోత్సాహిస్తారు.. కానీ మిగతా విషయాల్లో ఎంత టాలెంట్ ఉన్నా.. ఆ అవకాశం ఉండదు. పైగా అవి జీవితానికి అక్కరకు రావని తిడతారు. ఇదే పరిస్థితి ఎదురయ్యింది.. హర్యాణాకు చెందిన ఓ కుర్రాడికి. డ్యాన్స్ అంటే అతగాడికి ప్రాణం. కానీ ఇంట్లో వారు అందుకు అంగీకరించలేదు. చదువు మీద దృష్టి పెట్టు అన్నారు.
వారి ఒత్తిడి భరించలేక.. ఇంటి నుంచి పారిపోయాడు. ఫుట్ పాత్ మీద డ్యాన్స్ ప్రదర్శన ఇస్తూ.. అలా వచ్చిన డబ్బుతో జీవించసాగాడు. ఇతగాడి ప్రతిభ కాస్త సోషల్ మీడియా ద్వారా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరింది. ఇంకేముంది.. బిచ్చగాడి డ్యాన్స్ కు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. అతగాడికి బాలీవుడ్ లో అవకాశాలు కల్పించే బంపరాఫర్ ఇచ్చాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్.. జీప్ కు బదులు బొలెరో
హర్యాణాకు చెందిన వరుణ్ దాగర్ అనే కుర్రాడికి డ్యాన్స్ అంటే ప్రాణం. మ్యూజిక్ వినిపిస్తే.. చాలు పూనకం వచ్చిన వ్యక్తి మాదిరి ఊగిపోతాడు. కానీ తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేకపోయింది. దాంతో వరుణ్.. ఇంటి నుంచి పారిపోయి.. ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ ఫుట్ పాత్ మీద తన టాలెంట్ ని ప్రదర్శిస్తూ.. అలా వచ్చిన డబ్బుతో కాలం గడపసాగాడు. ఎప్పటికైనా బాలీవుడ్ కి వెళ్లాలనేది వరుణ్ కోరిక.ఇక వరుణ్ గురించి తెలిసిన వారు అతడి డ్యాన్స్ ప్రదర్శనని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ జాతీయా మీడియా సంస్థ కూడా వరుణ్ ప్రతిభ గురించి ఓ డాక్యుమెంటరీని టెలికాస్ట్ చేసింది. ఇది కాస్తా ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది.
ఇది కూడా చదవండి : ‘ఏం పేస్ట్ వాడుతున్నావ్’.. వైరలవుతోన్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
వరుణ్ ప్రతిభకు ముగ్దడైన ఆనందర్ మహీంద్ర.. అతడి డ్యాన్స్ వీడియోను తన ట్విటర్ లో షేర్ చేయడమే కాక బంపరాఫర్ ప్రకటించారు. ఈ క్రమంలో ‘‘వరుణ్.. నువ్వు ఇలానే డ్యాన్స్ చేస్తూ ఉండు. డ్యాన్స్ లో మనందరం భాగమే. నీకు నచ్చిన కళ ద్వారా భావవ్యక్తీకరణ చేసే హక్కు నీకుంది.. ఇకపై ఎవ్వరూ దాన్ని ఆపలేరు’’ అంటూ ప్రశంసలు కురిపించడమే కాక.. మహీంద్రా గ్రూపు కల్చరల్ విభాగం హెడ్ జయ్ ఏ షాని లైన్‌లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీంద్ర గ్రూప్ ఏర్పాటు చేసే కల్చరల్ ఈవెంట్స్ లో వరుణ్ ప్రోగ్రామ్ ఉండేలా చూడమంటూ ఆదేశించారు. బాలీవుడ్ లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వరుణ్ కి ఆనంద్ మహీంద్రా ఆఫర్ తో మార్గం సుగమం అయినట్లే. ఆనంద్ మహీంద్రా చూపిన చొరవపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dance on, Varun. We’re all part of the dance of life. Let no one curb your freedom to express yourself & your art. You embody the spirit with which we all hope to dance into the New Year. (@jaytweetshah we should get him to perform at our Delhi events) https://t.co/9VSP1A2Nbl
— anand mahindra (@anandmahindra) January 3, 2022