గత దశాబ్దంతో పోలిస్తే ఇప్పుడు సాంకేతికత విషయంలో పెను మార్పులే వచ్చాయి. కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీనికి ఇంటర్నెట్ విప్లవమే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు మన దేశంలో 4జీ సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు షురూ అయ్యాయి. అరచేతిలో మొబైల్ ఉంటే చాలు.. అన్నీ ఉన్నట్లే. జేబులో పర్సు లేకున్నా ఫోన్ ఉంటే చాలు.. డిజిటల్ చెల్లింపులతో ఏమైనా కొనేయొచ్చు, దేనికైనా డబ్బులు చెల్లించొచ్చు. కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు మన దేశంలో భారీగా పెరిగాయి. చేతిలో నగదు ఉంచుకోవడం క్రమంగా తగ్గుతోంది. యూపీఐ యాప్‌ల రాకతో డిజిటల్ చెల్లింపుల్లో వేగం పుంజుకుంది. ఇప్పుడేది కొనాలన్నా ఫోన్ తీసి స్కాన్ చేసేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ యూపీఐ యాప్‌ల వాడకానికి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టింది. అయితే ఈ డిజిటల్ కరెన్సీ పనితీరు గురించి ప్రజల్లో ఇంకా అవగాహన రాలేదు.
డిజిటల్ కరెన్సీ ఎలా పని చేస్తుందో చెబుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఒక పండ్ల దుకాణానికి వెళ్లిన ఆనంద్ మహీంద్రా.. ఫ్రూట్స్ కొన్న తర్వాత అక్కడ ఉన్న డిజిటల్ రూపీ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి డబ్బులు చెల్లించారు. అయితే ఇందులో విశేషం ఏముందని సందేహించకండి. యూపీఐ యాప్‌లో చెల్లింపులకు ఇంటర్నెట్ తప్పనిసరి. అదే డిజిటల్ రూపీలో అయితే అవసరం లేదు. అలాగే యూపీఐ వ్యాలెట్‌లో డబ్బులు ఉంటే వడ్డీ తీసుకుంటారు. కానీ డిజిటల్ రూపీలో డబ్బులు ఉంటే ఎలాంటి అదనపు చార్జీలు, వడ్డీ గానీ తీసుకోరు. అదే సమయంలో డిజిటల్ రూపీ చెల్లింపులకు స్టేట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే.. మనకు కనిపించకుండా మన జేబులో ఉండే కరెన్సీ లాంటిదే డిజిటల్ కరెన్సీ. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన డిజిటల్ కరెన్సీని మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్ రన్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే దేశం మొత్తం అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ క్రమంలో డిజిటల్ కరెన్సీ వినియోగంపై ఆనంద్ మహీంద్రా వీడియో చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతోంది. మరి, యూపీఐ పేమెంట్ల కంటే ఈ-రూపీ చెల్లింపులే మెరుగైనవని భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
At the Reserve Bank’s board meeting today I learned about the @RBI digital currency-the e-rupee. Right after the meeting I visited Bachche Lal Sahani, a nearby fruit vendor who is one of the first merchants to accept it. #DigitalIndia in action! (Got great pomegranates as well!) pic.twitter.com/OxFRWgI0ZJ
— anand mahindra (@anandmahindra) January 25, 2023