ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. రూ.13.14 కోట్లను ఖర్చుపెట్టి అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆయన కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే విలాసవంతమైన కార్లను తయారుచేసే రోల్స్ రాయిస్ సంస్థ తయారుచేసిన కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేసారు. జనవరి 31 న దక్షి మంబైలోని టార్డియో ఆర్టీఓ కార్యాలయంలో 20 లక్షలు పెట్టి ఆర్‌ఐఎల్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆర్‌టీవో అధికారులు తెలిపారు.. ఈ కారు అత్యంత విలాసవంతమైందే కాక.. భద్రత పరంగా కూడా ఎంతో మెరుగైంది.
రోల్స్ రాయిస్ సంస్థ మొదటిసారిగా 2018లో ఈ కారును విడుదల చేసింది. 2018లో భారత్ లో అందుబాటులోకి వచ్చిన రోల్స్ రాయిస్ కల్లినాన్ మోడల్ కు మరిన్ని మెరుగులు దిద్ది కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్ ను తీసుకొచ్చారు. దీన్ని 2020లో విడుదల చేశారు.అప్పట్లో దీని కనీస ధర రూ.6.95 కోట్లు. అయితే కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఈ కారులో మార్పులు చేసిన తర్వాత ధర పెరుగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాగా ముకేశ్ ఖాతాలో ఇది మూడవ కల్లినాన్ మోడల్ కావడం విశేషం. 2.5 టన్నులకు పైగా బరువున్న ఈ 12 ఇంజిన్స్ కారు 564 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.
రోల్స్ రాయిస్ కల్లినాన్ హ్యాచ్‌బ్యాక్ లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ అధినేత ఏకంగా రూ.20 లక్షల పన్ను చెల్లించారట. దీని రిజిస్ట్రేషన్ 2037, 30 జనవరి వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో పాటు రోడ్ సేఫ్టీ ట్యాక్స్ కింద యేదనగా మరో రూ.40 వేలు కూడా చెల్లించారు. ఈ కొత్త కారుకు రూ.12 లక్షలు చెల్లించి 0001 వీఐపీ నంబరును సొంతం చేసుకున్నారు ముకేశ్‌అంబానీ.
ఫీచర్స్ ఇవే..
6.75 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ 12 ఇంజన్ తో ఉంటుంది. బేసిక్ కల్లినాన్ మోడల్ తో పోల్చితే ఈ కారు మరింత పటిష్ఠమైంది. గరిష్ఠంగా 592 హెచ్పీ శక్తిని 900 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. గంటకు 100 కి.మీ వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. ఎడారి కొండ బురద లాంటి ప్రాంతాల్లో కూడా సులభంగా దూసుకెళ్తుంది. అంబానీ కొత్తకారుకు సంబంధించిన సమాచారం. అంబానీ లాంటి అపర కుబేరుడు రూ. 10 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేయడంలో వింతేమంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంబానీ కారంటే ఆ మాత్రం ఉండాలిలే.. అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.