చేతిలో స్మార్ట్ ఫోన్.. అందుబాటులో ఈ కామర్స్ సైట్లు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి.. బద్దకంగా మారిన మనిషి జీవితాలకు. ఇంట్లో కూర్చునే హ్యాపీగా షాపింగ్ చేసే అవకాశం ఉండడంతో.. దుస్తుల నుంచి బాత్రూమ్ లో వాడే మగ్గుల వరకు ఆన్ లైన్లోనే ఆర్డర్లు పెడుతున్నారు. వాటి ధరలు బయటి షాపుల్లో ధరలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉండడంతో ఎక్కువమంది ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. అమెజాన్ సైట్లో చోటుచేసుకున్న ఓకే ఘటన ఆ సంస్థను నవ్వులు పాలు చేస్తోంది.
అమెజాన్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఒక సాధారణ ప్లాస్టిక్ బకెట్ ధర 25,999 రూపాయలుగా ఉంది. దాని అసలు ధర రూ. 35,900 కాగా.. 28 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,900 తక్కువకు అందిస్తున్నట్టు రాసి ఉంది. అది చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో అమెజాన్ ను ఆడేసుకుంటున్నారు. ఆ స్క్రీన్ షాట్ ను షేర్ చేసి మరీ అమెజాన్ ను విమర్శిస్తున్నారు. ‘ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ‘అన్నీ అమ్ముడైపోయినట్టు ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది’ అని నెట్టింట జోకులు పేల్చుతున్నారు. టెక్నికల్ సమస్యో, లేదా ఇందులో మరేదైనా ప్రత్యేకత ఉందొ తెలియదు కానీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Just found this on Amazon and I don’t know what to do pic.twitter.com/hvxTqGYzC4
— Vivek Raju (@vivekraju93) May 23, 2022
See the MRP it’s 35.9k.
now don’t tell me that they forgot to mention a “.” after 9😅— Sudarsan (@SudarsanMajji) May 25, 2022
ఈ కామర్స్ సైట్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కొత్తేమి కాదు. మొన్నటికి మొన్న ఓ గొడుగు కారణంగా గూచీ, ఆడిదాస్ సంస్థలు ట్రోలింగ్ బారిన పడ్డాయి. వారు తయారు చేసిన ప్రత్యేక మైన గొడుగు ధరను లక్షా 27 వేల రూపాయలుగా నిర్ణయించారు. కానీ ఆ గొడుగు వాటర్ ఫ్రూఫ్ కాదు. అంటే వానలో ఆ గొడుగు వేసుకుంటే తడిసి ముద్దయిపోతారు. కేవలం ఎండలో మాత్రమే పనిచేస్తుంది. దీంతో నెటిజన్లు ఆ రెండు కంపెనీలను ట్రోల్ చేశారు. దీంతో గూచీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘ఆ గొడుగు కేవలం అలంకరణ కోసమే తయారుచేశాం’ అని ప్రత్యేకంగా ప్రకటించాల్సి వచ్చింది గూచీ సంస్థ. మరి.. ఈ బకెట్ ధరపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Africa: ఈ గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష వేశారు.. ఎందుకంటే?