ఇ- కామర్స్ వెబ్ సైట్.. ఇప్పుడు దాదాపు అందరికీ వీటి గురించి బాగా తెలుసు. నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, దుస్తులు, పాదరక్షలు, కాస్మొటిక్స్ ఇలా ఒక టేమిటి.. గుండుసూది నుంచి ఈ వెబ్‌సైట్లలో అన్నీ దొరుకుతాయి. ప్రస్తుతం స్మార్ట్ యుగంలో అంతా స్మార్ట్ ఫోన్లు పట్టుకుని అన్నీ ఆన్ లైన్లోనే కొనేసుకుంటున్నారు. వెనుకటి రోజుల్లోలాగా కిరాణ కొట్టుకు వెళ్లడం, క్యూలో నిల్చుని పాలు కొనే పరిస్థితులు కూడా ఇప్పుడు దాదాపుగా లేవు.
ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఇ-కామర్స్ వెబ్ సైట్లు పలు ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. వారి వెబ్‌సైట్లలో షాపింగ్ చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి. అయితే అందుకు తగిన సర్వీసును కూడా అందిస్తేనే వినియోగదారులు వారిని ఆదరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ వెబ్‌సైట్ పార్ట్‌నర్స్ చేసే పొరపాట్లు వారి మెడకు చుట్టుకోవచ్చు. అలా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పార్సిల్స్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆ వీడియోలో రైలు నుంచి పార్సిల్స్ ను ఎలా పడితే అలా విసిరేస్తూ కనిపించారు. దేశవ్యాప్తంగా ఈ వీడియో బాగా వైర్ అయ్యింది. ఆ వెబ్‌సైట్లపై కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కస్టమర్లకు ఇంత దారుణమైన సర్వీస్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వైరల్ వీడియోపై ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్పందించింది. అందుకు వివరణ కూడా ఇచ్చింది.
Amazon & Flipkart parcels 😂pic.twitter.com/ihvOi1awKk
— Abhishek Yadav (@yabhishekhd) August 29, 2022
ఆ వీడియోలో పార్సిల్స్ ను అలా విసిరేయడం జరిగిన మాట వాస్తవమే అని అమెజాన్ అంగీకరించింది. వారిపై ఇప్పటికే తగిన చర్యలు కూడా తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే అది పాత వీడియో అని.. సోషల్ మీడియాలో లేట్ గా వైరల్ అవుతోందని చెప్పుకొచ్చారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ వీడియోపై అటు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే సైతం స్పందించింది. ఆ వీడియోలో పార్సిల్స్ ను విసిరిపారేస్తోంది రైల్వే సిబ్బంది కాదని క్లారిటీ ఇచ్చింది. “పార్శిల్ వ్యాన్‌ను లీజుకు తీసుకున్న వ్యక్తులకే పార్సిల్స్ నిర్వహించే బాధ్యత ఉంటుందని చెప్పారు. వారి క్లెయింట్స్ పార్సిల్స్ ను ఎస్‌ఎల్‌ఆర్/ పార్సిల్స్ వ్యాన్ నుంచి లోడింగ్, అన్ లోడింగ్ చేయాల్సిన బాధ్యత వారిదే” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is an old video https://t.co/1VES8n3yBR pic.twitter.com/tOkUt7brZJ
— Northeast Frontier Railway (@RailNf) August 29, 2022