ఆగస్టు వచ్చిందంటే చాలు. ఈ-కామర్స్ కంపెనీలు ఇండిపెండెన్స్ డే సేల్స్ పేరుతో ఆఫర్లకు, డిస్కౌంట్లకు తెర లేపుతుంటాయి. ఈ సంవత్సరం కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరికొత్త సేల్స్ మొదలుపెట్టాయి. అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 పేరుతో, ఫ్లిప్‌కార్ట్.. బిగ్ సేవింగ్స్ డేస్ 2022పేరుతో ఆఫర్లను ప్రకటించాయి. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకూ ఈ సేల్స్ అందుబాటులో ఉంటాయి.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను 2 వేల వరకూ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా అమ్మే కొన్ని వస్తువులపై ముందుగానే ‘కిక్ స్టార్టర్ ఎర్లీ డేస్’ పేరుతో ఆఫర్లను అమెజాన్ ఇప్పటికే అందుబాటులో ఉంచింది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి ప్రీ-బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఆడియో డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు డిస్కౌంట్ ధరకే లభించనున్నాయి. షావోమి, పోకో, శాంసంగ్, రియల్ మీ, మోటోరోలా,యాపిల్, ఒప్పో కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుంది.
ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ నార్డ్ టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 28,999 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అంతేకాదు.. క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 26,499 రూపాయలు ఉంటే.. ఈ సేల్‌లో 24,999కే రానుంది. 49 రూపాయల నుంచే మొబైల్ యాక్సెసరీస్ ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. బోట్ ఎయిర్ డోప్స్ 181 వైర్ లెస్ హియర్ బడ్స్.. 1,299కే కొనుగోలు చేయొచ్చు. వన్‌ప్లస్ 50 అంగుళాల 4కే ఆండ్రాయిడ్ టీవీ 38,999 రూపాయలకు, లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ 32,990 రూపాయలకే అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
అలాగే.. గృహోపకరణ ఉత్పత్తులపై కూడా 60 శాతం వరకూ తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్‌టీవీలపై 50 శాతం డిస్కౌంట్ అప్లై కానుంది. ఎక్స్‌ఛేంజ్, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలని భావిస్తున్న వారికి సదవకాశమని చెప్పొచ్చు.
ఇక.. ఫ్లిప్‌కార్ట్.. బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, కొటక్ బ్యాంకు కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. టీవీలు, అప్లియన్సెస్‌పై 75 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. శాంసంగ్, రియల్ మీ, షావోమి కంపెనీల టీవీలతో పాటు పలు బ్రాండ్స్ టీవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఏసీలపై 55 శాతం డిస్కౌంట్, మైక్రోవేవ్స్‌పై 45 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి సేల్‌లో లాగానే ఈ సేల్‌లో కూడా 12AM, 8AM and 4PM కు క్రేజీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. రష్ హౌర్స్ పేరుతో 2AM కు భారీ డిస్కౌంట్స్ కూడా పొందే వీలుంది. మొత్తంగా ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకునే వారు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్స్‌పై ఓ లుక్కేసి.. మీకు నచ్చినవి సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Roshni Nadar: ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళ రోష్ని నాడార్.. ఆమె సంపద ఎంతంటే!
ఇదీ చదవండి: FD Vs RD: ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్.. ఈ రెండింట్లో ఏది బెటర్ ?