మీరు అమెజాన్‌లో ప్రెషర్ కుక్కర్ కొన్నారా? అయితే.. ఈ సమాచారం మీకోసమే. ఎందుకంటే.. అమెజాన్, నాణ్యత లేని 2,265 ప్రెషర్ కుక్కర్లను అమ్మేసిందట. మీరు అలాంటి కుక్కర్ కొనుగోలు చేసుంటే జాగ్రత్తగా ఉండాలి మరి. అవును నిజమే.. నాసిరకపు కుక్కర్లు అమ్మినందుకు అమెజాన్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ భారీ జరిమానా వేసింది. కస్టమర్లను స్వయంగా సంప్రదించి, ఆ కుక్కర్లను వెనక్కి తెప్పించాలని ఆదేశించింది. అలాగే వినియోగదారులకు వాటి ధరలను తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది.
భారత్‌లో విక్రయించే వస్తువులు.. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్-క్యూసీఓలో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలకు తగినట్లు ఉండాలి. అయితే.. క్యూసీఓ నాణ్యతా ప్రమాణాలను అందుకోకపోయినా.. అమెజాన్ తన ప్లాట్‌ఫాం ద్వారా 2,265 ప్రెషర్ కుక్కర్లు విక్రయించిందని సీసీపీఏ గుర్తించింది. వీటి ద్వారా ఆ సంస్థ రూ.6,14,825 ఆర్జించిందని నిర్ధారించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానా విధించింది. నాణ్యత సరిగా లేని కుక్కర్లను కొన్న కస్టమర్లను సంప్రదించి, ఆ వస్తువుల్ని వెనక్కి తెప్పించి, వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని అమెజాన్‌ను ఆదేశించింది సీసీపీఏ. దీనిపై 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.
ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్ మాల్, స్నాప్‌డీల్, షాప్‌క్లూ్‌స్ తో పాటు ఈ ప్లాట్‌ఫామ్‌లలో రిజిస్టర్ చేసుకున్న విక్రేత సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అలాగే.. ఆన్‌లైన్‌లో ఆయుర్వేద, సిద్ధా, యునాని ఔషధాల అమ్మకాలకు సంబంధించి అన్ని ఈ కామర్స్ సంస్థలకు ఇటీవల సీసీపీఏ తగు సూచనలు చేసింది. వైద్యులు రాసిచ్చిన మందుల చీటీని వినియోగదారులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాతనే ఔషధాల అమ్మకాలకు అనుమతించాలని సూచించింది.
CCPA passes order against #Amazon for allowing sale of domestic pressure cookers in violation to mandatory standards on its e-commerce platform@TimsyJaipuria reports.
*Follow thread for more* pic.twitter.com/14GUsMGOJT
— CNBC-TV18 (@CNBCTV18Live) August 4, 2022
ఇదీ చదవండి: ఇండిపెండెన్స్ డే సేల్స్.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్!