ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున‍్న ఆర్ధిక మాంధ్యం కారణంగా దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు, ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించడానికి సైతం వెనుకాడటం లేదు. ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ, తమ ఉద్యోగులను తమ ఇళ్లకు సాగనంపుతున్నాయి. మైక్రోసాఫ్ట్, షాపిఫై కంపెనీల బాటలో అమెజాన్ కూడా చేరింది. తన చరిత్రలోనే తొలిసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసింది. ఏకంగా లక్ష మంది ఉద్యోగులపై వేటు వేసింది.
అమెజాన్ వార్షిక ఫలితాల నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ ఒల్సావ్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెజాన్‌లో ఉన్న మొత్తం 15లక్షమంది ఉద్యోగుల్లో లక్షమందిని విధుల నుంచి తొలగించాం. వారిలో ఫుల్‌ఫిల్ మెంట్ సెంటర్, డిస‍్టిబ్యూషన్ నెట్ వర్క్ ఉద్యోగులు ఎక్కువుగా ఉన్నారు. నష్టాలను తగ్గించుకోవడానికి ఇదొక్కటే మార్గమని తాము భావిస్తున్నామని సీఈఓ బ్రియాన్ ఒల్సావ్స్కీ చెప్పారు. గత సంవత్సరం కూడా అమెజాన్ తన ఉద్యోగులను తొలగించింది. గతేడాది 27వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది.
మరోవైపు, పలు సంస్థలు కూడా నియామకాలను తగ్గించాయి. షాపిఫై, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. గూగుల్, ఫేస్‌బుక్‌లు తమ ఉద్యోగ నియామకాలను తగ్గిస్తున్నట్టు తెలిపాయి. అన్ని కంపెనీల మాదిరిగానే తాము కూడా ఈ ఏడాది రాబోయే కాలంలో నియామకాలను తగ్గించనున్నట్టు గూగుల్ సీఈవో తెలిపారు. ప్రస్తుతం కంపెనీలపై ఆర్థిక మాంద్యం ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే కంపెనీలు హైరింగ్‌ను తగ్గిస్తున్నాయి. ఏకంగా లక్ష మంది ఉద్యోగులపై వెట్ వేయడం.. సరైన నిర్ణయమా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Amazon reduced its global workforce in the first 6 months. At the end of June, Amazon’s global workforce, is 85k shy of the total at the end of 2021#futureofwork #layoffs #business @rwang0 @avrohomg @GlenGilmore @Shi4Tech @RagusoSergio @AkwyZ @kalydeoo @anand_narang @mvollmer1 pic.twitter.com/cLbnDDWfYD
— Hana (@Hana_ElSayyed) July 31, 2022
ఇదీ చదవండి: ఒకటి కానున్న Ola- Uber అంటూ వార్తలు.. స్పందించిన కంపెనీ!
ఇదీ చదవండి: భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓ.. ఏడాదికి రూ.123 కోట్లా?