‘రైతే.. రాజు..‘ ఈ నానుడి ఎలా వచ్చిందో తెలియదు కానీ ,ఈ భూమి మీద జీతం లేకుండా, స్వార్థం లేకుండా, జీవితాంతం కష్టపడేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆది ఒక రైతు మాత్రమే. పంట వేసింది మొదలు.. అది చేతికొచ్చే దాకా.. అహర్నిశలు దానికోసమే పాటు పడే వ్యక్తి. అలాంటి అన్నదాతకు కష్టాల్లో తోడుండడం కోసం.. కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అను పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఏటా రూ. 6,000 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తారు.
ఇప్పటికే.. 12 విడతలుగా పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కాగా, 13వ విడత.. డిసెంబర్ చివరి వారంలోగానీ, జనవరి మొదటి వారంలోగానీ ను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు ‘ఈ-కేవైసీ’ చేసుకోలేదని తెలుస్తోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే.. ఈ-కేవైసీ చేసుకోవాలని సూచిస్తోంది.. కేంద్ర ప్రభుత్వం. 12 విడతకు ముందు నుంచే.. ఈ నిబంధనను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈకేవైసీ చేసుకోని వారికి 12వ విడత డబ్బులు రాలేదు. ఇప్పుడు కూడా చేసుకోకుంటే 13వ విడత డబ్బులు కూడా జమ కావు.
పీఎం కిసాన్ లబ్ధిదారులు తమ ఈ-కేవైసీని మీసేవా, ఈ-సేవా కేంద్రాలలో నమోదు చేయించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించి ఈ-కేవైసీ అప్‌డేట్‌ల కోసం వారి సమీప వసుధ స్టేషన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇందుకు రుసుము చార్జీ కేవలం రూ. 15 రూపాయలనే వసూలు చేస్తారు. అలాగే.. ఆన్ లైన్ లో కూడా ఈ-కేవైసీ పూర్తి చేయొచ్చు. అందుకోసం.. కింద స్టెప్స్ ఫాలో అవ్వండి/
ఈ పథకానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నా.. లేదా ఏదైనా సహాయం కావాలన్నా.. pmkisan-ict@gov.inలో సంప్రదించవచ్చు. ఇది కాకుండా, PM కిసాన్ యోజన యొక్క హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 ను సంప్రదించవచ్చు.