గత కొన్నేళ్లుగా అక్షయ తృతియ నాడు బంగారం కొనడం తప్పనిసరి అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జ్యువెలరీ స్టోర్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆ వివరాలు..
భారతీయులకు బంగారంతో విడిదీయరాని అనుబంధం ఉంది. బంగారం అంటే భారతీయ మహిళల దృష్టిలో కేవలం ఆభరణం, ఖరీదైన లోహం మాత్రమే కాదు.. లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే భారతీయ మహిళలు పండగుల, ఇతర శుభకార్యాల వేళ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తారు. పండుగ పూట లక్ష్మీ దేవి ప్రతి రూపంగా భావించే బంగారాన్ని కొనుగోలు చేస్తే.. కలిసి వస్తుందనే నమ్మకం మన దగ్గర బలంగా పాతుకుపోయింది. అందుకే దీపావళి, వరలక్ష్మి వత్రం, అక్షయ తృతీయ, ధన్‌తెరాస్ వంటి పండుగల వేళ కొద్ది మొత్తంలో అయినా బంగారం కొనేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల ఏడాదంతా ఇంటికి సంపద వస్తుందని భావిస్తారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పర్వదినం వస్తోంది. ఆ రోజు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జ్యువెల్లరీ షాప్‌లు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫ్రీ గోల్డ్ కాయిన్, మేకింగ్ ఛార్జీల మీద భారీగా తగ్గింపు ప్రకటిస్తున్నాయి. మరి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏ జ్యువెలరీ స్టోర్‌లు ఎలాంటి ఆఫర్లు ప్రకటించాయో ఓసారి చూద్దాం.
విశ్వసనీయతకు మారు పేరుగా గుర్తింపు తెచ్చుకున్న టాటా కంపెనీ తనిష్క్ పేరుతో బంగారు ఆభరణాల మార్కెట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక అక్షయ తృతియ సందర్భంగా తనిష్క్ మేకింగ్ ఛార్జీలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారులు.. బంగారు, వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 25 శాతం వరకు తగ్గింపు పొందుతారు. ఇక ఈ ఆఫర్ ఏప్రిల్14-24 వరకు ఉంటుంది. 3 లక్షల రూపాయల వరకు కొనుగోలు చేసే బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 10 శాతం ఆ తర్వాత 3-7 లక్షల వరకు కొనుగోళ్లపై 15 శాతం, 7-15 లక్షల కొనుగోళ్లు వరకు 20 శాతం, 15 లక్షల రూపాయలు ఆపై కొనుగోళ్ల మీద 25 శాతం మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ఇవ్వనుంది.
అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. 30 వేల రూపాయలు ఆపై ఖరీదైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. వినియోగదారులకు 100 మిల్లీ గ్రాముల బంగారు నాణేం ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.
అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్, వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీల మీద సెన్కో గోల్డ్ 50 శాతం తగ్గింపు ప్రకటించింది. అలానే బ్రాండ్ కస్టమర్లకు డైమండ్ నగలపై 12 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అలానే పాత ఆభరణాలు ఇచ్చి కొత్త నగలు కొనుగోలు చేస్తే.. దానిపై 0 శాతం తగ్గింపు రుసుము వసూలు చేస్తామని ప్రకటించింది.
పీసీ చంద్ర జ్యువెలర్స్.. అక్షయ తృతీయ సందర్భంగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అన్ని రకాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 15 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అలానే డైమండ్, స్టోన్ కొనుగోలుపై 10 శాతం వరకు తగ్గింపు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 15-23 వరకు అందుబాటులో ఉంటుంది.