దేశంలోనే అతి పెద్ద టెలికాం నెట్ వర్క్ కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో భాగంగా ఉచితంగా అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ గడువును గుట్టుచప్పుడు కాకుండా తగ్గించింది. కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. రాను రాను జనాలు ఓటీటీలకు ఆకర్షితులవున్నారు. టెలికాం కంపెనీలు దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటిదాకా ఉచితంగా అందించిన కంపెనీలు ఇకమీదట ఆలా ఉండబోదంటూ సంకేతాలు ఇస్తున్నాయి.
ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్.. రూ.499, 999, 1199,1599 ప్లాన్లలో భాగంగా ఇంతకు ముందు ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుండగా.. ఇకపై ఆరు నెలలు మాత్రమే ఆ సదుపాయం ఉండనుంది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఏప్రిల్ 1 కంటే ముందు రీఛార్జి చేసుకున్న వారికి ఏడాది సబ్స్క్రిప్షన్ అమలవుతుండగా.. తర్వాత రీఛార్జి చేసుకున్న వారికి కేవలం ఆరు నెలల గడువే లభిస్తుంది. కొన్ని ప్రీపెయిడ్, బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపైనా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ను ఎయిర్‌టెల్ అందిస్తోంది. అయితే.. మైబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయిల్ మాత్రమే వర్తిస్తోంది. వీటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే,.. గతంతో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర 50 శాతం మేర పెరిగింది. గతంలో రూ.999 ఉండగా.. అది రూ.1499కి పెంచింది.
ఇది కూడా చదవండి: జియో ఫైబర్ అదిరిపోయే ఆఫర్.. కేవలం 100కే!