రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్.. ఈ రెండు కంపెనీల మధ్య పోటీ ఎక్కువ అనేకంటే.. పోరు ఎక్కువ అనడం కరెక్ట్ గా సరిపోతుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒక కంపెనీ ఒక కొత్త ప్లాన్ లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్షిస్తోంది అని వినబడితే చాలు.. రెండు రోజుల్లోపు మరో కంపనీ నుంచి కొత్త ప్లాన్ వచ్చేసినట్లే. ఈ రెండింటి మధ్య పోటీ ఆ లెవెల్ లో ఉంటుంది. ఏదైతేనేం.. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ రెండు కంపెనీలు రోజుకో కొత్త ఆఫర్ తో మన ముందుకొస్తున్నాయి. తాజాగా భారతి ఎయిర్‌టెల్.. జియో కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 150లోపు 4 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసింది.
రూ.109, రూ.111, రూ.128, రూ.131 ధరలతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ నాలుగు ప్లాన్స్ 30 రోజులు, నెల రోజుల వాలిడిటీతో అందిస్తున్నవి కావడం విశేషం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో చాలావరకు 28 రోజుల వాలిడిటీతో లభించేవే. అయితే.. తాజాగా లాంచ్ అయిన ఈ ప్లాన్స్‌తో కస్టమర్లు 30 రోజుల వాలిడిటీని పొందుతారు.
రూ. 109 ప్లాన్ :
ఈ ప్లాన్ లో రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్‌కి సెకనుకు రూ.2.5 చొప్పున ఛార్జ్ పడుతుంది. లోకల్ ఎస్ఎంఎస్‌లకు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌లకు రూ.1.44 ఛార్జ్ పడుతుంది. అలాగే రోజుకు 200 ఎంబీ డేటా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు.
రూ. 111 ప్లాన్ :
ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజులు. అంటే.. నెలకు 30 రోజులున్నా, 31 రోజులున్నా.. అన్ని రోజుల పాటు వాలిడిటీ వర్తిస్తుంది. రోజుకు 200 ఎంబీ డేటా పొందుతారు. రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్‌కి సెకనుకు రూ.2.5 చొప్పున ఛార్జ్ పడుతుంది.అలాగే లోకల్ ఎస్ఎంఎస్‌లకు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌లకు రూ.1.5 చొప్పున ఛార్జ్ పడుతుంది.
రూ. 128 ప్లాన్ :
ఇది 30 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు సెకనుకు రూ.2.5 చొప్పున ఛార్జీ పడుతుంది. నేషనల్ వీడియో కాల్స్‌కు సెకనుకు రూ.5 చెల్లించాలి. మొబైల్ డేటా ఒక ఎంబీకి 0.50 పైసలు ఛార్జీ పడుతుంది.
రూ. 131 ప్లాన్ :
ఇది నెల రోజుల రీఛార్జ్ ప్లాన్. అంటే ఈ నెల 1వ తేదీన మీరు రీఛార్జ్ చేయించుకుంటే మళ్లీ 1వ తేదీ వరకు వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ లో లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు సెకనుకు రూ.2.5 చొప్పున ఛార్జ్ పడుతుంది. లోకల్ ఎస్ఎంఎస్ లకు రూ.1 చొప్పున, ఎస్టీడీకి రూ.1.5 చొప్పున ఛార్జ్ పడుతుంది.
ఈ ప్లాన్స్ అన్నీ జియో ఆఫర్స్ కి కాస్త తక్కువగా.. ఆ యూజర్స్ ను ఆకర్షించే విధంగా ఉండటం విశేషం. మరి.. ఈ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Free Netflix Subscription: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం!