టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ పోటాపోటీగా కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. మా ప్లాన్‌ల వల్ల అధిక ప్రయోజనాలు పొందచ్చంటూ ఒకటి.. మా ప్లాన్‌లలోనే ఎక్కువ లాభాలు అంటూ మరొకటి యూజర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్, ప్రీపెయిడ్.. పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేలా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 489,509 రూపాయల విలువైన ఈ ప్లాన్లలో అపరిమిత డేటా లభిస్తుంది. ఇతర అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 50 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఉచితంగా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హలోట్యూన్ సదుపాయం, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్‌పై క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు అదనం.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 60 జీబీ డేటా లభిస్తుంది.అలాగే, అదనంగా ఉచితంగా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హలోట్యూన్ సెట్ చేసుకునే వెసులుబాటు, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్‌పై క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ ప్లాన్ వల్ల ప్రయోజనం ఏంటంటే.. రోజువారీ ప్లాన్లలో డేటా ఉపయోగించనట్లయితే నిరుపయోగం అవుతుంది. కానీ, ఈ ప్లాన్లలో డేటా నిరుపయోగం అవ్వదు. యూజర్ అవసరమైన సమయంలో ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి ప్లాన్లు, పోస్ట్ పెయిడ్ లలో లభిస్తాయి. ఇప్పుడు ప్రీపెయిడ్ లో తీసుకురావడం మంచి నిర్ణయమే. కాగా, ఎయిర్‌టెల్ ఇటీవలే కనీస రీఛార్జి ప్లాన్ ధరను దాదాపు 57 శాతం పెంచి రూ.155 చేసిన విషయం తెలిసిందే.
Bharti Airtel launches two new bulk data prepaid recharge plans #Airtel #AirtelPacks #DataPack #RechargePlans pic.twitter.com/ZNgEpxlepp
— Smartprix (@Smartprix) January 27, 2023