కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలకు రూ. 6000/- ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. ఇప్పటివరకు 11 విడతలుగా నగదు జమ అయ్యింది. ఇప్పుడు 12వ విడత నగదు రావాల్సి ఉంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద.. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడతను ఆగస్టు 1 నుంచి 30 నవంబర్ మధ్య, మూడవ విడత మెుత్తాన్ని డిసెంబర్ 1 నుంచి 31 మార్చి లోపు అందించింది. వీటిని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 31వ తేదీన 12 విడత నగదు జమ కావచ్చని తెలుస్తోంది.
ఒకవేళ మీరు ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజనలో మీ పేరు నమోదు చేసుకోకపోతే.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
ఆధార్ కీలకం
ఈ పథకం ద్వారా నగదు పొందాలంటే రైతులు వారి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాంక్ బ్రాంచ్‌లో డబ్బును జమ చేస్తారు. రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే వెబ్‌సైట్‌లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బిజినెస్ చేయాలనుకునే వారికి కోటి రుపాయల వరకు SBI రుణాలు!
ఇదీ చదవండి: అమెజాన్ లో ఆరేళ్ల చిన్నారి ఆధార్ కార్డు.. విమర్శల వెల్లువ! ఏంటంటే..