ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో, ఐడియాలతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో అప్పుడుప్పుడు వివాదాల్లో సైతం చిక్కుకుంటుంది. తాజాగా అమెజాన్ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడింది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో లామినేషన్ పౌచ్‌లను విక్రయించడం కోసం ఓ ఆరేళ్ల చిన్నారికి ఆధార్ కార్డు చిత్రాన్ని ప్రదర్శించడంతో వివాదం తలెత్తింది. ఆ ఆరేళ్ల చిన్నారి ఆధార్ కార్డు కు చెందిన సమాచారం అంతా వెబ్‌సైట్‌లో ప్రచురించేందుకు అమెజాన్ ఇండియా అనుమతించింది.
ఆధార్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామా మరియు ఇతర వ్యక్తిగత వివరాలు ఆధార్ కార్డ్ ఇమేజ్‌పై స్పష్టంగా కనిస్తున్నాయి. ఓ జాతీయ మీడియా టెక్ టీమ్ వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్‌ను తనిఖీ చేసింది.”ఐడెంటిటీని నిరూపించుకోవడానికి మరియు లావాదేవీలు నిర్వహించడానికి ఆధార్ కార్డును ఉచితంగా ఉపయోగించాలి. కానీ ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ వంటి పబ్లిక్ ప్లాట్ ఫారమ్ లలో ఉంచవద్దు” అని UIDAI ఇటీవల సలహా ఇచ్చింది. అయితే అమెజాన్ వెబ్ సైట్ లో అమ్మకానికి ఉన్న వస్తువులను పోస్ట్ చేయడానికి థర్డ్ పార్టీ వారు ఆధార్ కార్డ్ ఉపయోగించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “మై ఆఫీస్ స్టేషనరీ” అనే విక్రేత అమెజాన్‌లో లామినేషన్ పౌచ్‌లను విక్రయించడానికి ఆరేళ్ల బాలిక ఆధార్ కార్డును ఉపయోగించారు.
వెబ్‌సైట్లు మరియు మీడియా ఛానెల్ లకు కథనాలు, వీడియోలలో ఆధార్ కార్డ్‌ల చిత్రాలను పంచుకోకుండా మరియు ఆధార్ కార్డ్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని కనిపించకుండా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. E-ఆధార్‌ని డౌన్‌లోడ్ చేయడానికి పబ్లిక్ కంప్యూటర్‌ను ఉపయోగించకూడదని గతంలో UIDAI పౌరులను హెచ్చరించింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: 4వ అంతస్తు నుంచి పసిబిడ్డను విసిరేసిన తల్లి!
ఇదీ చదవండి: నాసిరకపు ‘ప్రెషర్ కుక్కర్’ అమ్మినందుకు అమెజాన్‌కు భారీ జరిమానా.!