బెస్ట్ EV బైక్‌.. రూ. 60 వేల తగ్గింపు.. 180 KM రేంజ్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ బైక్ మీద రూ. 60 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇక దీన్ని ఛార్జ్ చేస్తే 180 కి.మీ. రేంజ్ ఇస్తుంది. గంటలో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంటి దగ్గరే సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. దీని అసలు ధర ఎంతంటే?

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 03:35 PM IST

యూత్ ఎక్కువగా ఇష్టపడేది బైకులనే. బైక్ నడుపుతుంటే హీరోయిజం ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతుంది. అయితే పెట్రోల్ రూపంలో ఈ విలన్ గాడు ఆ హీరోయిజాన్ని చంపేస్తున్నాడు. అందుకే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి కానీ ఎలక్ట్రిక్ బైకులు ఎక్కువగా దింపడం లేదు. రివోల్ట్, కోమకి రేంజర్ వంటి పేరున్న కంపెనీల బైకులు తప్పితే చెప్పుకోతగ్గ బైకులు ఏమీ రాలేదు ఇటీవల కాలంలో. అయితే టార్క్ మోటార్స్ కంపెనీ టార్క్ క్రటోస్, టార్క్ క్రటోస్ ఆర్ పేరుతో రెండు స్టైలిష్ ఎలక్ట్రిక్ బైకులను దింపింది. పెట్రోల్ ఇంజిన్ బైకును పోలినట్టు ఉంటాయి. అందుకే వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

క్రటోస్ టాప్ స్పీడ్ గంటకు 100 కి.మీ. అయితే, క్రటోస్ ఆర్ టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 105 కి.మీ. ఉంటుంది. 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని క్రటోస్ 4 క్షణాల్లో అందుకుంటే, క్రటోస్ ఆర్ మాత్రం 3.5 క్షణాల్లోనే అందుకుంటుంది. పీక్ పవర్ వచ్చేసి 9 కిలోవాట్లు. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీంతో గంటలో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయచ్చు. టైమ్ ఈజ్ మనీ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాస్ట్ ఛార్జింగ్ చాలా అవసరం. హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటే 4 నుంచి 5 గంటలు పడుతుంది. గంటకు 25 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా గంటలో 80 శాతం బ్యాటరీ ఫిల్ అవుతుంది. నిమిషానికి 1.5 కి.మీ. చొప్పున 90 కి.మీ. ఛార్జింగ్ ఎక్కుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 180 కి.మీ. ప్రయాణించవచ్చు.

రెండేళ్ల వరకూ ఛార్జింగ్ నెట్వర్క్ యాక్సెస్ ని ఉచితంగా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎక్కడైనా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చు. అయితే క్రటోస్ బేసిక్ మోడల్ మీద ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. కేవలం క్రటోస్ ఆర్ మోడల్ కి మాత్రమే ఈ సదుపాయం ఉంది. 4 కిలోవాట్ సామర్థ్యంతో టార్క్ లిథియం అయాన్ బ్యాటరీని ఇందులో వాడారు. వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో వస్తుంది. దీనికి ఐపీ67 రేటింగ్ వచ్చింది. వాటర్ రెసిస్టెంట్ , అల్యూమినియంతో సీల్ చేయబడిన హెచ్పీడీసీ బాక్స్ తో వెదర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది తట్టుకుని నడవగలదు.

ఎకో, సిటీ, స్పోర్ట్స్, రివర్స్ మొత్తం నాలుగు మోడ్స్ లో వస్తుంది. క్రటోస్, క్రటోస్ ఆర్ బైకులు రెండూ నాలుగు మోడ్స్ లో ఒకేలా పని చేస్తాయి. ఎకో మోడ్ లో 120 కి.మీ., సిటీ మోడ్ లో 100 కి.మీ, స్పోర్ట్స్ మోడ్ లో రూ. 70 కి.మీ., రివర్స్ మోడ్ లో 5 కి.మీ. రేంజ్ ని ఇస్తాయి. ఈ బైకుల మీద మూడేళ్లు లేదా 40 వేల కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీ మీద మూడేళ్లు వారంటీ ఇస్తున్నారు. డ్యాష్ బోర్డు మొత్తం ఫుల్ డిజిటల్ గానే వస్తుంది. ఇది నాలుగు రంగుల్లో వస్తుంది. నీలం, తెలుపు, ఎరుపు, నలుపు రంగుల్లో వస్తుంది. క్లచ్ లేని ట్రాన్స్మిషన్ తో వస్తుంది. ఈ బండి గరిష్ట టార్క్ 38 న్యూటన్ మీటర్స్ ఉండగా.. ఆక్సిల్ ఫ్లక్స్ మోటార్ తో వస్తుంది.

ఇక ధర విషయానికొస్తే.. హైదరాబాద్ లో క్రటోస్ ఆర్ యాక్టివ్ ఎక్స్ షోరూం ధర రూ. 2,28,374గా ఉంది. ఫేమ్ 2 సబ్సిడీ కింద రూ. 60 వేలు తగ్గుతుంది. దీంతో ఫైనల్ ధర రూ. 1,68,374 పడుతుంది. జీఎస్టీతో కలిపే వస్తుంది. ఈ ధరలోనే హోమ్ ఛార్జర్ వస్తుంది. అయితే స్టేట్ సబ్సిడీ కోసం కస్టమర్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీవో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ టాక్స్, ఇతర యాక్ససరీస్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. బండి రిపేర్ వస్తే ఇంటికొచ్చి సర్వీస్ చేస్తారు. ఒక పెద్ద వ్యాన్ లో వచ్చి సర్వీస్ చేస్తారు. ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ బ్యాంకులు, పలు ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ప్రకారం నెలకు రూ. 2,999 నుంచి మొదలవుతుంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed