సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని అనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో నెలకు మంచి ఆదాయం సంపాదించాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. ఈ బిజినెస్ చేస్తూ మీరు ఇంట్లోనే ఉంటూ మంచి లాభాలు పొందవచ్చు. మరి ఆ బిజినెస్ ఏంటో చూసేయండి.
ఒకరి కింద పని చేయకుండా.. మీకు మీరే బాస్ గా ఉండాలని అనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. సాధారణంగా బొమ్మలకు ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంట్లో అలంకారం కోసం పెట్టుకునే వస్తువులు, ఆకర్షణీయమైన వస్తువులు వంటి వాటికి ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్దలు వీటి పట్ల బాగా ఆకర్షితులవుతారు. మరి ఈ డిమాండ్ ని మీరు క్యాచ్ చేసి క్యాష్ చేసుకోవచ్చు. దీని కోసం లక్షలు లక్షలు పెట్టుబడి అవసరం లేదు. 20 వేల లోపే తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని కోసం పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా చేయచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే?
3డి డాల్ ప్రింటింగ్ బిజినెస్. ప్రస్తుతం ఈ వ్యాపారం ట్రెండింగ్ లో ఉంది. ఈ 3డి ప్రింటర్ మెషిన్ ద్వారా బొమ్మలు, వస్తువులు తయారు చేస్తూ మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. సృజనాత్మకత ఉంటే మీరు మరింత ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఈ 3డి ప్రింటర్ ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో దొరుకుతుంది. దీని ధర ఆయా ప్రింటర్లను బట్టి ఉంటుంది. క్రియేలిటీ 3డి ఎండర్ ప్రింటర్ ధర ఆన్ లైన్ లో రూ.15,249కి దొరుకుతుంది. ఇది 400 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ప్రింటర్ సైజు కూడా ఎత్తు 25 సెంటీమీటర్లు, వెడల్పు 22 సెంటీమీటర్ల ఉంటుంది. దీనిలో ఒక ఫిలమెంట్ ఉంటుంది. ఈ ఫిలమెంట్ ధర ఒక కిలో వచ్చేసి రూ.800 నుంచి మొదలవుతాయి.
ప్రింటర్ కి 15 వేలు, ఈ ఫిలమెంట్ కి 5 వేలు ఖర్చు పెడితే 20 వేలతో వ్యాపారం స్టార్ట్ చేయచ్చు. ఈ 3డి ప్రింటర్ ద్వారా ప్రముఖుల ముఖ చిత్రాలతో కూడిన బొమ్మలు, రియలిస్టిక్ క్యారెక్టర్లు, రకరకాల బొమ్మలు.. లిమిట్ లేకుండా ఎన్ని రకాల బొమ్మలైనా తయారు చేయచ్చు. చాలా మందికి తమ రూపంలో బొమ్మలని ప్రింట్ చేయించుకోవాలని అనుకుంటారు. ఈ 3డి బొమ్మలకు మంచి డిమాండ్ ఉంది. మీరు ఆర్టిస్ట్ అవ్వాల్సిన పని లేదు. ప్రింటరే మీకు కావాల్సిన బొమ్మను 3డిలో ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. మీ దగ్గరకు మనుషులు వచ్చేలా చేసుకోవచ్చు, వారికి నచ్చిన బొమ్మలను, చిన్న చిన్న వస్తువులను తయారు చేసి ఇవ్వచ్చు. లేదా మీరు తయారు చేసి షాపుల వారికి ఇవ్వచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు నెలకు రూ. 30 వేల నుంచి రూ. లక్ష వరకూ ఆదాయం పొందవచ్చు. మొదట్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. ఫిలమెంట్ లోడ్ చేయడం, ఆపరేటింగ్ వంటివి నేర్చుకోవాలి. యూట్యూబ్ లో వీడియోలు చూడడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.