హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ‘వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్’ నిర్మాణం జరుపుకోబోతుంది. హైటెక్ సిటీ పరిసరాల్లో ఈ ప్రతిష్టాత్మక భవనం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు విదేశాలకే పరిమితమవనున్న కొత్త కొత్త కట్టడాలు హైదరాబాద్ లో నిర్మితం అవుతుండడంతో.. నగరవాసులకు కనువిందుగా మారనుంది.
వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్‌ను ‘360 డిగ్రీస్ లైఫ్’ సంస్థ నిర్మించనుంది. హైటెక్ సిటీ సమీపంలో మూడు ఎకరాల స్థలంలో ఈ భవనం నిర్మాణ పనులు 2024లో ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో మొత్తం 30 అంతస్తులు ఉండగా.. 25 అంతస్తులను నివాసాలకు మిగిలిన ఐదు ఫ్లోర్లు పార్కింగ్ కోసం కేటాయించనున్నారు. మొత్తంగా ఈ భవంతిలో 288 ప్లాట్స్ ఉండబోతున్నాయి. ఈ అపార్ట్‌మెంట్‌లో ప్రతీ ప్లాట్‌లో ప్రతీ అంతస్తులో చెట్లు వచ్చేలా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. చూడటానికి నిలువుగా విస్తరించిన అడవిలా ఈ భవనం కనిపిస్తుంది. ఇందులో ప్రతీ అపార్ట్‌మెంట్‌లో బాల్కనీలో పళ్ల చెట్లు, బెడ్‌రూమ్ దగ్గర సువాసన వెదజల్లే చెట్లు, కిచెన్ దగ్గర కూరగాయల మొక్కలు వచ్చేలా భవనం ఉండబోతుంది. నలువైపుల నుంచి గాలి, వెలుతురు ధారళంగా వచ్చేలా చెట్లు పెరిగేందుకు అనువుగా అత్యున్నత టెక్నాలజీ వాడుతూ ఈ భవనం నిర్మించబోతున్నారు.
360LIFE to build India’s first Vertical Forest Apartments in Hitec City, Hyderabad https://t.co/Ri5FsFHkR2
— Business Khabar (@business_khabar) June 1, 2022
ఇది కూడా చదవండి: Viral Video: బిడ్డను తొలిసారి చూసి మురిసిపోయిన తండ్రి జిరాఫీ..! వీడియో వైరల్!
ఈ నిర్మాణం ఏషియాలో రెండోదిగా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే చైనాలోని ‘కివీ’ సిటీలో తొలి వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరగింది. అందులో 826 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దాని తర్వాత రెండో భవంతిని హైదరాబాద్‌లో నిర్మించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
These “vertical forests” are the future of apartment buildings. (Via @CheddarGadgets) pic.twitter.com/ChyQc07kWR
— Cheddar News 🧀 (@cheddar) May 5, 2019