జూబ్లీహిల్స్ లో స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అయితే హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లాంటి ఏరియా మరొకటి రెడీ అవుతుంది. ఈ ఏరియాలో ప్రీమియం హిల్ టాప్ విల్లా ప్లాట్స్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాలను తలదన్నేలా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డెవలప్ చేసే పనిలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఐటీ సెక్టార్ సహా పలు కంపెనీల పెట్టుబడులతో ఆ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది వేగంగా పుంజుకుంది. అయితే హైదరాబాద్ లో మరో జూబ్లీహిల్స్ తయారవుతుందని మీకు తెలుసా? జూబ్లీహిల్స్ అంటే చాలా రిచ్ ప్లేస్. ఇక్కడ సామాన్యులు ఇల్లు అద్దెకు తీసుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఇక ఇల్లు కట్టుకోవడం అంటే పెద్ద క్రైమ్ చేసినట్టే. జూబ్లీహిల్స్ లో మీకు రిచ్ ఇల్లు లేకపోయినా, స్థలం లేకపోయినా గానీ కొత్త జూబ్లీహిల్స్ లో ప్రీమియం విల్లా ప్లాట్స్ సొంతం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 25 నిమిషాల ప్రయాణ దూరంలో ఎయిర్ పోర్ట్ దగ్గర శ్రీశైలం రోడ్ మీద రెరా అప్రూవ్డ్ ప్రీమియం హిల్ టాప్ విల్లా ప్లాట్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ దశలో ఉన్న ఈ ప్లాట్స్ ప్రారంభ ధర రూ. 36 లక్షల నుంచి ఉంది. అంటే గజం కేవలం రూ. 13,500కే లభిస్తుంది. 150 గజాల స్థలానికి రూ. 20 లక్షల 25 వేలు అవుతుంది. రూ. 36 లక్షల బడ్జెట్ పెట్టుకుంటే 266 గజాల స్థలం వస్తుంది. అంటే 2394 చదరపు అడుగుల స్థలం వస్తుంది. ఈ స్థలంలో ప్రీమియం విల్లా ప్లాట్ కట్టుకోవచ్చు. లేదా రెండు 2 బీహెచ్‌కే హౌజ్ లు కట్టుకోవచ్చు. ఒకరే రూ. 36 లక్షలు పెట్టుకోలేకపోతే ఇద్దరు వ్యక్తులు కలిసి కొనుక్కోవచ్చు. ప్లాట్ డెవలప్ అయ్యాక లాభానికి అమ్ముకోవచ్చు. లేదా అక్కడే ఇల్లు కట్టుకుని ఉండాలనుకున్నా గానీ ఉండవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఉన్నట్టే ఉండే అనుభూతిని అక్కడ డెవలపర్లు ప్లాట్స్ ని సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ 24 కి.మీ. దూరంలో ఉంది. 50 నిమిషాల సమయం పడుతుంది. అక్కడ నుంచి 20 నిమిషాలు ప్రయాణం చేస్తే సిటీలోకి రావచ్చు. హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఏరియాలకు 30 నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది ఈ ఏరియా. అదే టీసీఎస్, టాటా ఏరోస్పేస్ కంపెనీలు ఉన్న ఆదిభట్ల నుంచి ఐతే 20 కి.మీ., శ్రీశైలం హైవేకి 18 కి.మీ. దూరంలో ఉంది. ఎటు చూసినా గానీ సిటీ నుంచి ఈ ఏరియాకి కనెక్టివిటీ అనేది బాగుంది. భవిష్యత్తులో ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు గజం రూ. 13,500 అంటే బాగా డెవలప్ అయ్యాక రూ. 50 వేలు అవుతుంది. దాదాపు 4 రెట్లు పెరుగుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ఏరియాల్లో భూములు ఎలా ఉన్నాయి, ఇప్పుడెలా ఉన్నాయి అనేది చూస్తే మీకే అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అనేది. భూమి మీద పెట్టుబడి పెట్టి కోటీశ్వరులు అయిన వాళ్ళని చాలా మందిని చూసే ఉంటారు.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.