ఇప్పుడు అభివృద్ధి అనేది హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరిస్తోంది. కాబట్టి శివారు ప్రాంతాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో లాభాలను చూడవచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఇండ్ల స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. దీంతో చాలా మంది హైదరాబాద్ శివారు ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోతున్నారు. దూరమైనా గానీ ప్రశాంతమైన బతుకు బతకొచ్చునని అనుకుంటున్నారు. పైగా హైదరాబాద్ లో ఉన్న ధరలతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో ధరలు తక్కువ కాబట్టి అక్కడే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా అని శివారు ప్రాంతాలేమీ తక్కువ కాదు. అక్కడ కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. కంపెనీలు వస్తున్నాయి. రోడ్ కనెక్టివిటీ అనేది బాగుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాయి. భవిష్యత్తులో శివారు ప్రాంతాలు కూడా హైదరాబాద్ లో ఒకటిగానో లేదా హైదరాబాద్ లా మరో నగరంగానో రూపాంతరం చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శివారు ప్రాంతాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు.
ఇప్పుడు అందరూ 2 బీహెచ్కే ఫ్లాట్లు, ఇండ్లనే ఇష్టపడుతున్నారు. కాబట్టి 2 బీహెచ్కేకి సరిపోయే స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మీరు ఉండడానికైనా లేదా భవిష్యత్తులో అమ్మడానికైనా సరే ఈ స్థలం అనేది కనీస ప్రాధాన్యత. 2 బీహెచ్కేకి కనీసం 1000 చదరపు అడుగులు కావాలి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో స్థలాలు చాలా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నిమ్జ్ సమీపంలో ఉన్న ఏరియాలు ఇవి. నిమ్జ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఏరియాలో అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ని తెలంగాణ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తోంది. ఇక్కడ లక్షల్లో ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ క్రమంలో ఈ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ కి రెక్కలు వస్తాయి. అందుకే కింద ఉన్నప్పుడే కొనేసుకుని పెట్టుకుంటే మంచిది.
ఇప్పటికే చాలా మంది ఈ ఏరియాల్లో భూములు కొనేసుకుంటున్నారు. ఈ ఏరియాల్లో గజం రూ. 3,500 నుంచి 7 వేలు, 8 వేలు, 9 వేలు రేంజ్ లో ఉన్నాయి. గరిష్టంగా రూ. 11 వేలు, రూ. 15 వేలకు కూడా ఉన్నాయి. 144 గజాలు అంటే మూడు సెంట్ల స్థలం కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 5 లక్షల 4 వేలు అవుతోంది. గజం రూ. 7 వేల చొప్పున ఐతే 144 గజాలకు రూ. 10 లక్షల 8 వేలు అవుతోంది. 100 గజాల స్థలానికి ఐతే రూ. 7 లక్షలు మాత్రమే అవుతోంది. ఇప్పుడు గజాల లెక్కన అమ్ముతున్నారు. డెవలప్ ఐతే చదరపు అడుగుల లెక్కన అమ్ముతారు. గజం ఇప్పుడు రూ. 3 వేలు, 5 వేలు, 7 వేలు ఉంటే.. డెవలప్ అయ్యాక చదరపు అడుగు ఈ రేటు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు.
పైగా ఈ ఏరియాల్లో క్లబ్ హౌజ్ లు, స్విమ్మింగ్ పూల్స్, వెడల్పు రోడ్లు, పార్కులు వంటి అనేక సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. ఇన్ని సౌకర్యాలతో ఇంత తక్కువ ధరలో మరెక్కడా దొరకవు. ఇక సదాశివపేట, కోహెడ ప్రాంతాల్లో చదరపు అడుగు రూ. 1,650 పలుకుతోంది. సంగారెడ్డిలో రూ. 1,750, రామేశ్వరం బండలో రూ. 2,250, శామీర్ పేట్ లో రూ. 2,450 పలుకుతున్నాయి. 1000 చదరపు అడుగులకు రూ. 16 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ ఉన్నాయి. దూరం గురించి ఆలోచించకుండా పెట్టుబడిగా చూస్తే కనుక తక్కువ సమయంలో లాభాలను పొందవచ్చు.
గమనిక: పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. మీ పెట్టుబడి మీ సొంత నిర్ణయం మాత్రమే. మీకు అవగాహన రావడం కోసం మాత్రమే ఈ కథనం. గమనించగలరు.