ప్రస్తుతం భూమి బంగారం కంటే ఎక్కువ అయిపోయింది. భూమికున్న విలువ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఉన్న ధరలు ఇప్పుడు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 6 లక్షలకు 165 గజాల స్థలం ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.
భూమికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. స్టాక్ మార్కెట్లో షేర్లు కొంటే పడిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే పెద్ద లాభం ఉండదు. బంగారం కొంటే పడిపోయే అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటే అమ్మో రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. సరే కాసేపు పాజిటివ్ గా ఆలోచించినా కూడా షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం వీటిలో పెట్టుబడి పెట్టినా కూడా 100 రెట్లు దాటి పెరగడం అనేది అసంభవం. అదే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే వందల రెట్లు లాభాలు వస్తాయి. మీకో విషయం తెలుసా.. హైదరాబాద్ లో భూమ్మీద పెట్టుబడి పెట్టిన 40 ఏళ్లలో దాని విలువ 500 రెట్లు పెరిగింది. అంటే భూమికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 40 ఏళ్ల క్రితం ఎకరం రూ. 5 లక్షల లోపు ఉండేది. ఎకరం అంటే వంద సెంట్లు. సెంటు 48 గజాలు అంటే ఒక్కో గజం రూ. 104. ఇప్పుడు అదే గజం రూ. 50 వేలు పైనే. భూమిని నమ్ముకుంటే ఆ రేంజ్ అవుట్ పుట్ ఉంటుంది మరి.
అలాంటిది 6 లక్షలకు 165 గజాలు ఇస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి సరిపోయే 3 సెంట్ల కంటే కాస్త ఎక్కువ ఉన్న స్థలాన్ని కేవలం రూ. 6 లక్షలకు ఇస్తున్నారు. ఈరోజుల్లో 6 లక్షలకు ఇండ్ల స్థలం ఎక్కడొస్తుంది చెప్పండి. 2023 హైదరాబాద్ మార్కెట్లో ఒక చదరపు అడుగు విలువ యావరేజ్ గా రూ. 4500 ఉంది. ఒక గజానికి 9 చదరపు అడుగులు కాబట్టి గజం విలువ రూ. 40,500 ఉంది. హైదరాబాద్ లోని వివిధ ఏరియాల్లో గజం రేటు ఎలా ఉందో చూస్తే నిజంగా సామాన్యుడు కొనేటట్టు అయితే లేదు. కొండాపూర్, జూబ్లీహిల్స్, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో చదరపు అడుగు వచ్చేసి 10 వేల నుంచి 30 వేలు పైనే ఉంది. సిటీలో గజం స్థలం కొనాలంటే కనీసం గజానికి రూ. లక్ష నుంచి 2 లక్షల 80 వేల వరకూ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ లెక్కన మూడు సెంట్లు అంటే 150 గజాలు కొనాలంటే కోటిన్నర నుంచి 4 కోట్ల వరకూ పెట్టుకోవాలి. ఎందుకు ఇంత ధర అంటే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు కాబట్టి. మరి ఇంత ధర ఉన్న ఇండ్ల స్థలం 6 లక్షలకు ఎవరిస్తారు అని అనుకుంటున్నారా?
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అంటే ధర ఎక్కువ ఉంటుంది, కానీ అభివృద్ధి చెందే ప్రాంతాల్లో మొదట్లో ధర తక్కువగానే ఉంటుంది కదా. ఆ తర్వాత అమాంతం పెరిగిపోతుంది. మీరు ఇప్పుడు గనుక 6 లక్షలు పెట్టి 165 గజాలు కొంటే రెండేళ్లలోనే ఆ అమౌంట్ రెట్టింపు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు సిటీలో ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో స్థలాన్ని కొనలేరు. అలాంటి వారికి సిటీ అవుట్ కట్స్ లో 10 నుంచి 15 లక్షల బడ్జెట్ లో తక్కువ ధరకే ప్లాట్స్ ని విక్రయిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 13,300 కోట్లు. పలు కంపెనీలు 60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ నిమ్జ్ గనుక డెవలప్ అయితే ఆ ప్రాంతంలో 2.77 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ ప్రాజెక్టును 12,635 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇప్పటికే 2887 ఎకరాల భూసేకరణ జరిగింది.
ఈ ఏరియా డెవలప్ అయితే గనుక భూమి ధర ఆకాశాన్ని అందుకుంటుంది. అప్పుడు భూమి కొనాలంటే చాలా కష్టం. ప్రస్తుతం ఈ ఏరియాలో గజం వచ్చేసి రూ. 3,500 నుంచి ఉంది. రూ. 7,500, రూ. 11000 ఇలా ఉన్నాయి. 165 గజాలు కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 5,77,500 అవుతుంది. సుమారుగా రూ. 6 లక్షల రూపాయలు అవుతాయి. 165 గజాలు కొనాలంటే 6 లక్షలు అవుతుంది. అంటే 3 సెంట్ల స్థలం అన్నమాట. మీరు ఈ ప్రదేశంలో ఇల్లు కట్టడమో, ఫ్లాట్లు కట్టడమో చేసి అద్దెకు ఇచ్చుకోవచ్చు. మీరైనా ఉండవచ్చు. లేదా బాగా ధర పెరిగిన తరువాత అమ్ముకోవచ్చు కూడా. ఆ ఏరియాలో కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఏరియా డెవలప్ అయ్యాక మీరు స్థలం కొన్న జహీరాబాద్ నిమ్జ్ ఏరియాలోని ఉండచ్చు. బాగా ఆలోచించుకోండి. 165 గజాలు సిటీలో కొనాలంటే కోటిన్నర నుంచి 4 కోట్లు పైనే అవుతుంది.
ఇదే స్థలం జహీరాబాద్ లో 6 లక్షలకు లభిస్తుంది. ఎలాగూ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది కాబట్టి మీరు పెట్టిన 6 లక్షలకు నష్టం అనేది ఉండదు. ఎలా కాదన్న 6 నుంచి 15 లక్షల లోపు ప్లాట్స్ అయితే వస్తున్నాయి. మామూలుగా కంపెనీ ధర కంటే వెంచర్ లాంఛింగ్ సమయంలో గజానికి రూ. 500 నుంచి రూ. 2000 వరకూ డిస్కౌంట్ ఇస్తుంటాయి. అడ్వాన్స్ కింద ఒక లక్ష ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బు లేకపోయినా బ్యాంకు లోన్ పెట్టుకుని కూడా కట్టవచ్చు. కొన్ని కంపెనీలు ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. ఆన్ లైన్ లో వెతికితే దీని గురించి పూర్తి వివరాలు లభిస్తాయి. జహీరాబాద్ ఏరియాలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఓపెన్ ప్లాట్స్ ని అమ్ముతున్నాయి. గూగుల్ లో వెతికితే వారి కాంటాక్ట్ నంబర్స్ దొరుకుతాయి. వారిని సంప్రదించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి దిగండి.