హైదరాబాద్ లో ఎల్బీనగర్ కి 8 కి.మీ. దూరంలో రూ. 25 లక్షలకే 150 గజాల స్థలం దొరుకుతుందంటే నమ్ముతారా? కానీ తక్కువ బడ్జెట్ లో తక్కువ ధరకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
సొంతింటి కల ఎంతోమందికి ఉంటుంది. స్థలం కొనుక్కుని నచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. కానీ హైదరాబాద్ లో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. ఇక స్థలం కొని ఇల్లు కట్టుకోవాలంటే కోటి పైనే అవుతుంది. ఇది భరించలేక చాలా మంది శివారు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కొంతమంది అయితే సిటీకి బాగా దూరంగా వెళ్లిపోతున్నారు. కొంతమంది మాత్రం ఫ్లాట్స్ కొనుక్కుని సర్దుకుపోతున్నారు. అయితే హైదరాబాద్ లో చదరపు అడుగు స్థలానికి పెట్టే ధరతో ఈ ఏరియాలో గజం స్థలం దొరుకుతుంది. 25 లక్షల లోపే 150 గజాల స్థలం దొరికే ఏరియా హైదరాబాద్ లో ఉంది. ఎల్బీ నగర్ కి 8 కి.మీ., వనస్థలిపురం ఏరియాకి 12 కి.మీ. దూరంలో ఉంది ఈ ఏరియా.
ఎల్బీ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో స్థలం కొనాలంటే గజం రూ. 45 వేల నుంచి రూ. 55 వేలు అవుతుంది. ఒక 10 కి.మీ. అవతలకు వెళ్తే గజం రూ. 16 వేలకే దొరుకుతుంది. ఎల్బీనగర్ సమీపంలో బాలాపూర్ ఏరియా ఉంది. సౌత్ ఈస్ట్ జోన్ లో ఉన్న బాలాపూర్ వేగంగా పెరుగుతున్న రెసిడెన్షియల్ లొకేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలాపూర్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కారణంగా రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంది. ఈ ఏరియాలో గజం రూ. 16,500 పలుకుతోంది. అంటే పాతిక లక్షల లోపే 150 గజాల స్థలం దొరుకుతుంది. ఇది కనిష్ట ధర. సగటు ధర ఐతే రూ. 22,500 ఉంది. గరిష్టంగా ఐతే రూ. 28,500 పలుకుతోంది. ఈ ఏరియాలో ఇంకా తక్కువ ధరకు కూడా స్థలాలు దొరుకుతున్నాయి.
ఈ ఏరియాలో ఆయా పరిసరాలను బట్టి రూ. 23 లక్షలకే 136 గజాలు, రూ. 25 లక్షలకే 200 గజాల స్థలం దొరుకుతుంది. 30, 36 లక్షల బడ్జెట్ లో కూడా ప్లాట్స్ దొరుకుతున్నాయి. బిల్డర్ ప్రాజెక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 180 నుంచి 267 గజాల విస్తీర్ణంలో ప్లాట్స్ ని విక్రయిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ లో గజం రూ. 35 వేలు పలుకుతోంది. 180 గజాల స్థలం కొనాలంటే రూ. 63 లక్షలు అవుతుంది. ఇవి ప్రీమియం ప్లాట్స్. అదే ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక 1000 చదరపు అడుగుల ఇంటికి కనిష్టంగా రూ. 29 లక్షలు అవుతుంది. అదే యావరేజ్ గా అయితే రూ. 38 లక్షలు అవుతుంది. గరిష్టంగా అయితే రూ. 48 లక్షలు అవుతుంది. ఈ ఏరియాలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నా, కట్టిన ఇల్లు కొనుక్కున్నా తక్కువ బడ్జెట్ లో సొంతింటి కల అనేది నెరవేరుతుంది.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.