స్థలం కొనాలని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో ఊహించని లాభాలు వచ్చే ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం. ఈ ఏరియాలో రూ. 15 లక్షలకే 150 గజాల ప్లాట్ సొంతం చేసుకోండి. డెవలప్ అయ్యాక కొనాలన్నా కొనలేరు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కంటే శివారు ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడం మేలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోయే దశకు వచ్చిందని అంటున్నారు. ఇప్పుడున్న దాని కంటే గొప్పగా ఏమీ ల్యాండ్ రేట్లు పెరగవని చెబుతున్నారు. ఎంతవరకూ చేరుకోవాలో చేరుకొని ఆగిపోయిందని నిపుణుల మాట. జీవో 111 ఎత్తివేతతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి రిస్క్ చేసి సిటీలో కొనే కంటే సిటీకి కొంచెం దూరమైనా గానీ శివారు ఏరియాల్లో కొనుగోలు చేస్తే ఊహించని లాభాలను చూడవచ్చునని అంటున్నారు. పైగా సిటీలో పెట్టే ధరలకు శివారు ప్రాంతాల్లో 4, 5 ప్లాట్లు కొనవచ్చునని అంటున్నారు.
మీరు కనుక స్థలం మీద పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాలు ఉత్తమమైన ఛాయిస్ అని చెబుతున్నారు. ముఖ్యంగా సిటీకి దగ్గరగా ఉన్న అజీజ్ నగర్, మొయినాబాద్, అజీజ్ నగర్, చేవెళ్ల, వికారాబాద్ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చునని అంటున్నారు. జీవో 111 ఎత్తివేతతో ఈ పరిధిలో ఉన్న 84 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లూ వ్యవసాయ భూములుగా ఉన్న పొలాలు ఇప్పుడు ఇండ్ల స్థలాలుగా మారబోతున్నాయి. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ ని తలపించేలా మరో మహా నగరం ఏర్పడనుంది. అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అజీజ్ నగర్ సిటీకి చాలా దగ్గరగా ఉంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ రావడానికి 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. రింగ్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది.
హైదరాబాద్ కంటే ఇంకా అధునాతన సదుపాయాలు, సౌకర్యాలతో జీవో 111 పరిధిలో ఉన్న ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని చూడబోతున్నాం. అటువంటి ఏరియాలో ఎకరం రూ. 2 కోట్లు ఉంది. ఎకరం రూ. 2 కోట్లకు తక్కువ లేదు. ఈ ఏరియాలో డెవలప్ చేసిన ప్లాట్ ని గజం రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు అమ్ముతున్నారు. రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు పెట్టి 150 గజాల స్థలం కొనుగోలు చేస్తే కనుక రెండేళ్లలో ఊహించని లాభాలను చూడవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి విషయంలో కాస్త ఆలస్యం అయినా గానీ మరీ ఆలస్యం అయితే ఉండదని చెబుతున్నారు. ఇక్కడ స్థలం మీద పెట్టుబడి పెడితే నష్టపోవడం అనేది ఉండదని, ఖచ్చితంగా లాభాలు ఉంటాయనే చెబుతున్నారు. సిటీకి దగ్గరగా ఉండేలా స్థలాలు కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
గమనిక: ఈ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. అలానే స్థలం కొనుగోలు చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి. ఈ సమాచారం కేవలం మీకు ఒక అవగాహన రావడం కోసం మాత్రమే ఇవ్వబడింది. సుమన్ టీవీ యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత లేదని గమనించగలరు.